Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నవతెలంగాణ- కొల్చారం
ప్రజాసంక్షేమ పథకాలకే టీఆర్ఎస్ ప్రభుత్వం అంకితమవుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. బుదవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులు తమతమ నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో కలిసి ప్రజాసమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలకు అంకితమవుతూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విదంగా కళ్యాణ లక్ష్మీ, షాదీముభారఖ్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతకుముందు అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముభారఖ్, చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్, జడ్పీటీసీ మేఘాల సంతోష్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, టీఆర్ఎస్ మండల యూత్ అద్యక్షుడు సంతోష్ రావు, మండల గౌడ సంఘం అధ్య్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా నాయుడు వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యాదాగౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, సర్పంచ్ ల ఫోరం మండల అద్యక్షుడు పేరోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డి, సర్పంచ్ లు శివప్పగారి మాదవి శ్రీశైలం, కన్నారం రమేష్, బండి సుజాత, సువర్ణ, ఉమాదేవి, మోతీ, శ్రీనివాస్, ఎంపీటీసీ ఎల్లయ్య, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.