Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్
నవతెలంగాణ-నిజాంపేట
భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని బుధవారం నాడు అన్నారు నిజాంపేట మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్పుర్తి తో సంపూర్ణ స్వాతంత్రం కోసం యువత కదలాలి అని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన నిజాంపేట్ మండలంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ అధ్వర్యంలో భగత్ సింగ్ 115 వ జయంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఈ విషయమై జగన్ మాట్లాడుతూ. భగత్ సింగ్ చిన్నా తనంలోనే దేశం కోసం అందరికి స్వాతంత్రం అందాలని బానిసతత్వం పోవాలని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ తన ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడా లాడించి కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడిన వీర యోధుడు. రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ ట్యక్ బాండ్ పై భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతిశీల అభ్యుదయ భావాలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన నిర్వహిస్తున్న బీజేపీ పాఠ్యాంశాల్లో మతోన్మాదాన్ని మూఢత్వాన్ని పెంచే విధంగా విద్యా విధానాన్ని అవలంబిస్తుందని బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉరికంభం ముద్దాడిన భగత్ సింగ్ జీవిత విశేషాలను కర్ణాటక ప్రభుత్వం పాఠ్యంశం నుంచి తొలగించి మూఢవిశ్వాసాలు పెంచే విధంగా స్వాతంత్ర పోరాటంలో ఏ రోజు పాలుపంచుకొని లి''సావర్కర్ అండమాన్ జైలు నుంచి బుల్బుల్ పక్షి రెక్కల పై వచ్చి పోరాటం చేసి మళ్లీ జైలుకు వెళ్ళినట్టుగా పాఠ్యపుస్తకాలలో ఉంచారు, ఇది బిజెపి నీతిమాలిన విద్యా విధానానికి మూఢత్వానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంకై యువత సిద్ధం కావాలని అన్నారు. దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులలో విద్యలో కులాన్ని మతాన్ని చొప్పించి ప్రయత్నం చేస్తుంది అన్నారు. భవిష్యత్తులో నూతన విద్యా విధానం రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని అన్నా రు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నిజాంపేట్ మండల కార్యదర్శి నవీన్ నాయకులు కల్యాణ్, ప్రకాశ్, పాల్గొన్నారు.