Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు కార్మికులు గాయపడితే.. ఒక్కరే గాయపడ్డారన్న యాజమాన్యం
- యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
- సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
కాజిపల్లి, గడ్డపోతారంలోని ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 1లో బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయ పడగా.. కేవలం ఒక్క కార్మికుడు మాత్రమే గాయపడ్డాడని పరిశ్రమ యాజమాన్యం చెప్పడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య అన్నారు. ప్రమాద విషయం తెలియగానే పరిశ్రమను సందర్శించడానికి వస్తే.. యాజమాన్యం పరిశ్రమలోకి అనుమతి నిరాకరించిం దన్నారు. ఆందోళన చేస్తే తప్పా లోపలికి వెళ్లనీవ్వక పోవడం సరికాదన్నారు. ప్రమాద ఘటన పైన పూర్తి సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం దాగుడుమూతలు ఆడిందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ జరపా లని డిమాండ్ చేశారు. ముగ్గురు కార్మికులు గాయపడితే ఒక్కరే గాయపడ్డారని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాయపడిన కార్మికులను యజమా న్యమే పూర్తిగా ఆదుకోవాలన్నారు. వైద్య ఖర్చులు భరించా లని డిమాండ్ చేశారు, యజమాన్య నిర్లక్ష్యం ఫలితంగానే ప్రమాదం జరిగిందన్నారు. కార్మికులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు సత్యం, నరసింహులు, చంద్రశేఖరు, శ్రీనివాసు, రామచందర్, సాయిలు, అలాగే టీఆర్ఎస్కెవీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.