Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మద్దూరు ఎస్సై నారాయణ గురువారం విలేకరులకు తెలిపారు. నల్గొండ జిల్లా మరియాల గ్రామం పిజియా తండాకు చెందిన ధారావత్ భాస్కర్ వంగపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో రేషన్ బియ్యాన్ని నిలువ చేసినట్లు నమ్మదగిన సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడ పీడీఎస్ బియ్యం సీజ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఆ వ్యక్తిని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జిల్లా జగదీశ్వర్ ఉన్నారు.