Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
తమకు తెలియకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమ తండ్రి పేరున ఉన్న భూమిని ఫౌతీచేయడానికి దొంగతనంగా స్లాట్ బుక్ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ బాధితులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన సంఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. బాధితురాలు పెంటమ్మ తెలిపిన వివరాల ప్రకారం మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామానికి చెందిన చింతకింది నర్సాగౌడ్‌కు నలుగురు కుమారులు యాదాగౌడ్, కిష్టాగౌడ్, వెంకట్‌గౌడ్, నగేష్గౌడ్లు. కాగా కూతుళ్లు లక్ష్మి, బూదమ్మ, పెంటమ్మలు ఉన్నారు. కాగా నర్సాగౌడ్‌కు గ్రామంలో సర్వే నంబర్ 156లో 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. కాగా నర్సాగౌడ్ గత 19 సంవత్సరాల క్రితం మృతి చెందాడని తెలిపారు. దాంతో భూమి పంపకాల విషయంలో గొడవలు జరిగాయని, భూమి మార్పును చేయకుండా ఆపేసినట్టు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫౌతీ కాలేదన్నారు,. కానీ తమకు తెలియకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు దొంగ ఆదార్ కార్డులను పెట్టి మా అన్నలైన కిష్టాగౌడ్, వెంకట్‌గౌడ్, నగేష్గౌడ్లు కలిసి ఫౌతీ(పేర్ల మార్పు) కోసం స్లాట్ బుక్‌చేసినట్టు బాధితులు అన్న యాదాగౌడ్, పెంటమ్మలు తెలిపారు. ఇతరుల ద్వార తమకు తెలియడంతో తాము తహసీల్దార్ వద్దకు వచ్చామని లేదంటే తమకు చెందిన భూమిని ఇతరులను చూపించి ఫౌతీని చేయించుకునే వారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనంగా ఫౌతీ కోసం స్లాట్ బుక్‌చేసిన ముగ్గురిపై చట్టపరంగా చర్యలు తీసుకుని, బుక్ చేసిన స్లాట్‌ను రద్దుచేయాలంటూ యాదాగౌడ్, పెంటమ్మలు తహసీల్దార్ బిక్షపతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ను వివరాణ కోరగా భూమి ఫౌతీకై స్లాట్ బుక్చేశారని, తమకు తెలియకుండా స్లాట్ బుక్‌చేసినట్టు ఫిర్యాదు చేశారని దాంతో విచారణ చేసి స్లాట్‌ను నిలిపేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, బాధితులు పెంటమ్మ, శ్రీహరిగౌడ్‌లు ఉన్నారు.