Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమాలకు సిద్ధం చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి
నవతెలంగాణ-కొమురవెల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండలం లోని మర్రిముచ్చాల గ్రామంలో పార్టీ శాఖ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో 12 శాతం పన్నులు వసూలు చేస్తూ.. సామా న్యులపై పెనుభారం మోపుతుందన్నారు. ఆహార పదార్థాల తో పాటు పాలపై పన్నులు వేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వేలకోట్ల లబ్ధి చేకూర్చు కుంటున్నదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించ కుండా, ప్రభుత్వ కంపెనీలను అమ్మేస్తున్నారని విమర్శిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, లక్ష రూపాయల రుణమాఫీ లాంటి హామీలను అమలు చేయ కుండా.. కేసీఆర్ జిమ్మిక్కులతో పాలన కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో బీజేపీ, టిఆర్ఎస్ మోసాలపై ప్రజా ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నక్కల యాదవ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, మహిపాల్, బాలరాజు, వరలక్ష్మి, దుర్గయ్య, ఎల్లారెడ్డి ,యాదయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.