Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
ఎల్ఐసి పాలసీదారులకు ప్రీమియంపై జీఎస్టీని తగ్గించాలని.. వారికి పాలసీపై ప్రభుత్వం బోనస్‌ను పెంచాలని.. ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గజ్వేల్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏజెంట్లు, పాలసీదారుల సమ స్యలను తీర్చాలని జోనల్ లీడర్ డి సురేందర్ కుమార్ డిమాండ్ చేశారు. గజ్వేల్ ఎల్ఐసి బ్రాంచ్ అధ్యక్షులు మోతే వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి సాంబయ్య ,కోశాధికారి బి మల్లేశం, డివిజనల్ నాయకులు బట్టు మహేందర్ రెడ్డి, కే శ్రీధర్ రెడ్డి, సీనియర్ ఏజెంట్లు ఏ మహేందర్, ఏం రాఘ వరెడ్డి ,బి పులిందర్ రెడ్డి, ఆర్ కిష్టయ్య, సిహెచ్ శ్రీనివాస్ ,లక్ష్మారెడ్డి, ఎస్ శ్రీనివాస్, రామకృష్ణ ,శ్రీశైలం, నరేందర్ రెడ్డి ,నవీన్ ,కరుణాకర్, యాదగిరి, ఏజెంట్లు పాల్గొన్నారు.