Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 పడకల ఆసుపత్రితో గిరజనులకు ఎంతోమేలు
- నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
- కౌడిపల్లిలో 50 పడకల ఆసుపత్రికి భూమి పూజ
నవతెలంగాణ-కౌడిపల్లి
కౌడిపల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రిని నిర్మించాలన్న తన చిన్ననాటి స్వప్నం నెరవేరబోతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కౌడిపల్లిలో ఆదివారం 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చుట్టుపక్కల అనేక గిరిజన తండాలు ఉంటాయని.. ఈ 50 పడకల ఆసుపత్రి వారందరికీ సౌకర్యంగా ఉంటుందన్నారు. తన చిన్ననాటి కాలంలో అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల విఠల్ రెడ్డి ఎంతో శ్రమించి ఆరు పడకల ఆసుపత్రిని నిర్మించారని.. నేటికీ అది కొనసా గుతున్నదన్నారు. కాగా కౌడిపల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రిని నిర్మించాలనే తన చిన్ననాటి కల నేటితో నెరవేరిందన్నారు. త్వరలో మంత్రి హరీశ్‌రావుని ఆహ్వానించి శంకుస్థాపన చేయిస్తానన్నారు. ఆస్పత్రి నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌కు అందరూ సహకరించాలన్నారు. 50 పడకల ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సకు మంత్రితో చర్చించి ఏర్పాటు చేస్తామన్నారు. అనుకున్న గడువులోగా ఆసుపత్రిని నిర్మాణం చేపట్టాలని ఉత్తేదారును ఆదేశించారు. అలాగే మరో రూ.4 లక్షలతో ఆసుపత్రికి కాంపౌండ్ వాల్ మంజూరైనట్టు వెల్లడ్డించారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీపీ రాజు నాయక్, ఎంపిటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ డి ఏం అండ్ హెచ్ ఓ విజయ నిర్మల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్ యాదవ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సార రామ గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిలుముల చిన్న చిన్నం రెడ్డి, కో.ఆప్షన్ సభ్యుడు హైమాద్, నాయకులు దుర్గా రెడ్డి, నాగ్సన్ పల్లి సర్పంచ్ ఎల్లం, మండల టిఆర్ఎస్ యూత్ పార్టీ అధ్యక్షుడు చంద్రం కృష్ణా గౌడ్, డాక్టర్ శోభన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ రెడ్డి, కాంట్రాక్టర్ రామకృష్ణ నాయకులు రాజిరెడ్డి, కాంతారావు, నర్సింగరావు వీరయ్య, వైద్య సిబ్బంది, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు