Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పాపన్నపేట
ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారిని ఆదివారం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కార్యని ర్వాధికారి సారా శ్రీనివాస్, ధర్మకర్తలు, అర్చకులు, ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కార్యనిర్వహ ణాధి కారి శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అటు తర్వాత వారు గోకుల్ షెడ్లో నిర్వహి స్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండలం టీఆర్ఎస్ నాయకులు పుల్లన్న గారి ప్రశాంత్ రెడ్డి,అంజిరెడ్డి, నగ్సాన్ పల్లి మాజీ సర్పంచ్ ఇందిరా నరసింహులు గౌడ్ ,భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.