Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నకోడూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు హాస్పిటల్కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు కల్పిస్తున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ రోజా, ఎంపీపీ మాణిక్య రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి జెడ్పీ చైర్ పర్సన్, ఎంపీపీలు భూమి పూజ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ప్రజా అరోగ్యంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో ప్రభుత్వ ఆసు పత్రిలో మెరుగైన వసతులు, వైద్యం అందుతున్నట్లు తెలిపారు. ప్రజలు అందరూ ఆరోగ్యం పైన దృష్టి సారించ ాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలందరూ వేడి చేసి కాచిన మంచినీరు త్రాగాలన్నారు. ఇంటి ముందు చెత్తాచె దారం లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, పీఏసీఎస్ గంగాపూర్ చైర్మన్ కనకరాజు, స్థానిక సర్పంచు సుభాష్ గౌడ్, ఎంపీటీసీ జ్యోతి చంద్రం, ప్రిన్సిపల్ పద్మలత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.