Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛ పాఠశాల, కళాశాలలకు నగదు
- మెమొంటో అందజేసిన కలెక్టర్
నవతెలంగాణ-కొండపాక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గురుకుల పాఠశాల, కళాశాలలుగా ఎంపికైన వారికి నగదు, మెమొంటోలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన పాఠశాల ప్రాంగణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రోనాల్డ్ రోస్ ( సెప్టెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు) స్వచ్ఛ గురుకులం అనే మహౌత్తర కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ చేతులమీదుగా విడుదల చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదుల శుభ్రత, విద్యార్థుల వసతి గృహం, పరిశుభ్రత, వాష్‌రూమ్‌లు, ప్రయోగశాలలు, క్రీడా మైదానం, విద్యుత్ దీపాలు, పరికరాలు, ఇతర సామగ్రి, నీటి కుళాయిలు, ట్యాంకులను శుభ్రం చేసుకోవడం, చెట్ల మధ్యలో కలుపు మొక్కలను తొలగించారు. స్వచ్ఛ గురుకులంలో భాగంగామెదక్ ఈస్ట్ రీజియన్ సిద్దిపేట జిల్లాలో గల 17 విద్యాలయాలలో నిర్వహించిన పోటీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల-తొగుట మొదటి నగదు బహుమతి రూ.20 వేలు, రెండో నగదు బహుమతి రూ.15 వేలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల మిట్టపల్లి, తృతీయ నగదు బహుమతి రూ.10 వేలు చేర్యాల మహిళ డిగ్రీ కళాశాలకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చేతులు మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయ అధికారి నిర్మల, ఏఆర్సీఓ వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.