Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
సిద్దిపేట పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు నంగునూరు మండలంలోని రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో శనివారం రాత్రి ఎల్ఈడీ స్రీన్ ద్వారా కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. గంజాయి నష్టాలు, ఆన్ లైన్ బ్యాంక్ మోసాలు, షీ టీమ్, డయల్ 100, తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, బాల్య వివాహాలపై వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డాకూరి కనకవ్వ, ఉప సర్పంచ్ బెదురు పోచవ్వ, టీఆర్ఎస్ నాయకులు డాకూరి భాస్కర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ యాదవ రెడ్డి, కానిస్టేబుల్ రమేష్, రాజు, కళా బృందం సభ్యులు బాల్ నర్సు, రాజు, రవీందర్, తిరుమల, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..