Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మశాలి జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య
నవతెలంగాణ-చేర్యాల : మార్కండేయ, హనుమాన్ దేవాలయాలు, సమాజ అభివృద్ధితో పాటు పద్మశాలి నిరుపేదల అభివృద్ధి కోసం యువకులు కృషి చేయాలని పద్మశాలి సమాజం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య కోరారు. చేర్యాల పట్టణ కేంద్రంలోని మార్కండేయ దేవాలయ ఆవరణలో ఆదివారం పద్మశాలి యువజన సంఘం చేర్యాల పట్టణ కమిటీ అధ్యక్షులు ఆడెపు మహేష్, ప్రధాన కార్యదర్శి గోనె శివకుమార్‌తో పాటు కార్యవర్గ సభ్యులచే పద్మ శాలి సమాజం పట్టణ అధ్యక్షులు దూడం వెంకటేశం అధ్యక్షతన ఆడెపు చంద్రయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షులు బింగి శ్రీనివాస్, ఇప్పకాయల రాజశేఖర్, తాటి సాయి, సహాయ కార్యదర్శులు ఇప్పకాయల గణేష్, అరగొండ బిక్షపతి, కుందారపు నవీన్, బొడ్డు సంతోష్, కోశాధికారి ఆడెపు శంకర్, సహాయ కోశాధికారి పాశికంటి నాగరాజు, కార్యవర్గ సభ్యులు గోనె నాగరాజు, రాపెల్లి అఖిల్, వనం భరత్‌కుమార్, ఆడెపు వినరు, ఇప్పకాయల చెర్రీ, పద్మశాలి సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది వెంకటేశం, కోశాధికారి నాగుల వెంకటేశం పాల్గొన్నారు.