Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజ్లో విద్యార్థిణుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఏడి నారాయణరాజును కఠినంగా శిక్షించాలిని ఎమ్మెన్నార్ యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు రమ్య మాట్లాడుతూ.. నారాయణరాజును వెంటనే యూనివర్సిటీ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో అమ్మాయిల హాస్టల్ రూమ్ల్లోకి నారాయణరాజు వెళ్లి తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రిపేర్స్ ఉంటే ముందే విద్యార్థినీలకు చెప్పి చేయించాలన్నారు. అలా కాకుండా అమ్మాయిల గదిలోకి ఇష్టానుసారంగా పోయి వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీ విద్యార్థులు గత మూడు రోజుల పాటుగా ఆందోళన చేస్తున్నారు.. కానీ మేనేజమెంట్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. వెంటనే ఏడి ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, జిల్లా కమిటీ సభ్యులు రవి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు.