Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా వైద్యుల పట్ల అనుచిత ప్రవర్తన
- ఎంఎన్ఆర్ కళాశాల వైద్య విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ-సంగారెడ్డి
ఎంఎన్ఆర్ కళాశాల ఏడీని సస్పెండ్ చేయాలని వైద్యవిద్యార్థు లు డిమాండ్ చేశారు. శనివారం కళాశాల ఆవరణలోని ప్రధాన గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశా రు. కళాశాలలో చదువుకుంటున్న పీజీ, యూజీ మెడికల్ విద్యార్థినుల పట్ల ఏడీ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. ఏడీ డౌన్ డౌన్, ఏడీని వెంటనే స స్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. కళాశాల యాజమాన్యం పెడుతున్న ఇ బ్బందుల వల్ల తాము మానశికంగా కృంగిపోతున్నామని పలువురు వైద్య విద్యార్థి నులు పేర్కొన్నారు. ఎడీ మహిళా డాక్టర్లు ఉంటే ఆసుపత్రి, హాస్టల్ గదుల్లోకి అను మతి లేకుండా ప్రవేశిస్తున్నాడని, బెడ్స్, బాత్రూమ్స్లోకి వెళ్లి చూడడం చేస్తున్నాడ న్నారు. రాత్రి వేళ ఒంటి గంట సమయంలోనూ మహిళా డాక్టర్లు ఉండే గదుల్లోకి ఎలా ప్రవేశిస్తాడని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్స్లో మహిళా వార్డెన్ ఉండనే ఎడీకి ఏం పని అన్నారు. తనిఖీల పేరుతో తమ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. ఎడీ ప్రవర్తన బాగలేదని తాము కళాశాల యాజమాన్యానికి రాతపూ ర్వకంగా పిర్యాదు చేశామన్నారు. తాము పిర్యాదు చేసిన తర్వాత కూడా ఎడీ మళ్లీ తమ గదుల్లోకి వచ్చాడన్నారు. ఎడీపై చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం ఆయన్ను వెనకేసుకొస్తుందన్నారు. ఎడీని సస్సెండ్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఎడీపై చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం పైగా తమదే తప్పనట్లుగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అవుటింగ్, సమయంపాలన, ప్రెండ్లీగా ఉండడం వంటి విషయాల్లో అనవసరమైన నిబంధనలు పెట్టి కక్షసాధిస్తున్నారని విమర్శించారు. గత నాలుగైదు రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఎడీని సస్సెండ్ చేయకపోతే తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామన్నారు. ఏ విషయంలోనైనా ప్రశ్నించినా అడిగినా వారిపై కక్షసాధిస్తున్నారన్నారు. భయంతో సర్దుపోతున్నా కొద్దీ ఎడీ ప్రవర్తన మరింత దారుణంగా మారుతుందన్నారు.