Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మద్దూరు
కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కోరారు. సీఐటీయూ మద్దూరు మండల విస్తృతస్థాయి సమావేశం మండల కన్వీనర్ ఎండీ షఫీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్య చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మిక హక్కులను రక్షించాలన్నారు, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహించి, అనేక సమ్మెలు నిర్వహిస్తున్న సీఐటీయూకు కార్మికులు అండగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. మహాసభల జయప్రదానికి అన్ని యూనియన్లు, సంఘాల కార్మిక ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం జిల్లా కార్యదర్శి ఆలేటి యాదగిరి, గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు బి.కృష్ణారెడ్డి, బి.వేణు, సీఐటీయూ మండల నాయకులు కే.ఎల్ల స్వామి, రాజయ్య, భాస్కర్, సిద్ధులు, నర్సిరెడ్డి, రమేష్, శీను, మల్లేశం, మల్లారెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.