Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దేవులపల్లి రాజేందర్
నవతెలంగాణ-నంగునూరు
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దేవులపల్లి రాజేందర్ మాదిగ హెచ్చరించారు. గురువారం నంగునూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి ఇప్పటికీ 8 సంవత్సరాలైన దాని ఊసెత్తడం లేదన్నారు. వర్గీకరణ విషయంలో మోసం చేసిన నరేంద్ర మోడీ రామగుండం వస్తే రణరంగంగా మారుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నా పట్టించుకోని బీజేపీ దళితులను అవమానిస్తూ వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్టుగానే యూనివర్సిటీ ఉద్యోగాల పదోన్నతిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందన్నారు. మాదిగలను మరోసారి మోసం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.