Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు జరిగే సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కడవేరుగు, పోతిరెడ్డిపల్లి, నాగపురి గ్రామాలలోని హమాలీ కార్మికులతో కలిసి మహాసభకు సంబంధించిన కరపత్రాలను కళావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. మహాసభ జయప్రదానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు చేర్యాల మండల కన్వీనర్ రే పాక కుమార్, హమాలీ కార్మి కులు పాల్గొన్నారు.