Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -గజ్వేల్
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సమితి పార్టీలో గజ్వేల్ చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు ఇంద్రగౌడ్ చేరారు. సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ వేలామంది యువకుల బలిదానంతో వచ్చిన తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం సీనియర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులు సిలివేరు ఇంద్ర గౌడ్ కు తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సమితి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.