Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యప్ప స్వాముల పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి దంపతులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-నర్సాపూర్
శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో హరివరాసనం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నర్సాపూర్ హైదరాబాద్ ప్రధాన రోడ్డులోని అటవీ ప్రాంతంలో.గల పందివాగు వద్ద నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయ ప్రాంగ ణంలో గురువారం అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు అశోక్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజను గురువారం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు నర్సాపూర్ శివాలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాముల పాదయాత్ర పల్లకి సేవను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పల్లకి సేవా పాదయాత్ర నర్సాపూర్ ప్రధాన రోడ్డు గుండా సాగి అయ్యప్ప దేవాలయ ప్రాంగణం వరకు చేరింది. అయ్యప్ప స్వాముల పాద యాత్ర శరణు ఘోషతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సిహెచ్ మదన్ రెడ్డి దంపతులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా శబరిమల అయ్యప్ప దేవాలయం మాదిరి గా నర్సాపూర్‌లో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో తాను కూడా భాగస్వామి అవుతున్నందుకు ఆనందంగా ఉంద న్నా రు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తా నని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర మహిళా కమి షన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్ ఒక పుణ్యక్షేత్రంగా వెలసిల్లబోతుందన్నారు. ఈ ఆలయ నిర్మాణ ంలో తన వంతు సహకారం అందిస్తా నన్నారు. ఈ ఆలయ నిర్మాణం అటవీ ప్రాంతమైన చెట్ల మధ్యలో రాయ రావు చె రువు సమీపంలో ఉండడం ఆహ్లాద కరమైన వాతావ రణ ంలో నిర్మించడం అభినందనీ యమన్నారు. జిల్లా గ్రంథాల యాల సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అన సూయ అశోక్ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, శివంపేట ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీ టీసీ మహేష్ గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్ టీఆర్ ఎస్ మండ లాధ్యక్షులు చంద్రశేఖర్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.