Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్ గోల్డ్ మునక్క బ్రాండ్ పేరుతో చాక్లెట్ల విక్రయం
నవతెలంగాణ-పటాన్చెరు
చార్మినార్ గోల్డ్ మునక్క బ్రాండ్ పేరుతో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. విక్రయి స్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు. పటాన్చెరు ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డి గురువారం వివరాలను వెల్లడిం చారు. ఒరిస్సాకు చెందిన అనిమేష్ దాస్,రంజిత బొద్ర, బాజ్ర మోహన్ పాత్ర గల ముగ్గురు సభ్యుల ముఠా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఇస్నాపూర్. పాశం మైలారం ప్రాంతాలలో రహస్యంగా పాన్ షాప్ ల్లో సిగరెట్, పాన్ పదార్థాలతో పాటు చార్మినార్ గోల్డ్ మునక్క బ్రాండ్ పేర ుతో ఒక్కో గంజాయి చాక్లెట్‌ను 20 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పటన్‌చెరు ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డి బృందంతో గురు వారం ఇస్నాపూర్, పాశమైలారంలోని మూడు పాన్ షాప్‌ల లో సోదాలు నిర్వహించి పాన్ షాప్ లలో 271 చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సైలు రాములు, శ్రీనివాస్ సిబ్బంది టైటస్ కుమార్. అఫ్జల్. సత్యనారాయణ, నాగేష్, యాదయ్య, చారి, గంగా లక్ష్మి,అలేఖ్యలు పాల్గొన్నారు.