Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కులస్తులారా !బహుజనులారా !మేల్కొనండి
నవతెలంగాణ-నిజాంపేట
గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజాసేవయే పరమావధిగా భావించి అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను గలం విప్పుతున్న యువ నాయకుడు మెదక్ జిల్లా నిజాంపేట మండలం బీఆర్ఎస్ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు, నార్లాపూర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని ఇంగ్లీష్ మీడియం డిజిటల్ క్లాసులను నడిపించడానికి విజయ్‌కుమార్ ఎంతో కృషి చేశారు. స్కూల్ పిల్లలకు షూ, స్కూల్ యూనిఫాం, ఫేర్వెల్ డే, స్కూల్లో టీచర్ల కొరత ఉన్నందున ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం టీచర్లను పెట్టి విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి కృషి చేస్తుశారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనారోగ్యం పాలై ఆకస్మిక మరణాలు చెందిన వారికి ఆర్థిక సహాయం అందించి తన ఉదారత చాటుకున్నారు. ఎన్నో కుటుంబాలకు విజయకుమార్ అండగా నిలుస్తూ అన్నా అంటే నేనున్నానంటూ ప్రతి పేదవారికి చేయూతనిస్తున్నారు. నిజాంపేట గ్రామానికి చెందిన రెడ్డి అనిల్ కుమార్‌కు బీఎస్సీ అగ్రికల్చర్లో చేరేందుకు రూ.40 వేల ఆర్థిక సహాయం చేశారు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు రూ.45 వేలు, చల్మెడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు 30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నస్కల్ గ్రామంలో తల్లి తండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలకు, నందగోకుల గ్రామంలో నిరుపేదకు సొంత ఖర్చులతో ఇల్లును నిర్మించి ఇచ్చారు. అదే గ్రామంలో ఇల్లు కూలిపోయి భర్తను కోల్పోయిన కుటుంబానికి ఆడపిల్లల చదువుల విషయంలో కూడా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. నందగోకుల గ్రామంలో రూ.1.50 లక్షలతో ఇంకుడు గుంతల నిర్మాణం, మినీ వాటర్ ట్యాంకులు నిర్మించడంతో పాటు బోరు మోటర్లను పంపిణీ చేశారు. మండలంలోని 6 గ్రామాలలోని 600 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించారు. కరోనా సమయంలో రూ.10 లక్షలను ఖర్చు చేసి అందే ప్రతాపరెడ్డి, మల్లేష్ వీరేందర్ రెడ్డిల సహకారంతో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మట్టలు అందజేశారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి అధికార పార్టీ అతనికి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వగా జెడ్పీటీసీగా విజయం సాధించారు. జెడ్పీటీసీగా గెలిచి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కాలేజీ, గురుకుల పాఠశాల, బస్టాండు నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రాంపూర్ నుంచి నిజాంపేట మండల కేంద్రం వరకు రోడ్డు మరమ్మత్తుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవచేసే వారిని విమర్శించడం తగదని గుర్తు చేశారు. నీతి నిజాయితీగా ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ప్రజల కొరకు నిరంతరం పాటుపడుతున్నారనే మంచిపేరును సంపాదించుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కొంత మంది నాయకులకు మింగుడు పడడం లేదని చెప్పొచ్చు. మండలంలో బీసీలను ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి బహుజనుల సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి పంజ విజయకుమార్ అంటున్నారు. జెడ్పీ సమావేశంలో సమస్యలపై అధికారులు, పాలకవర్గాన్ని నిలదీస్తుండడంతో కొంత మంది అగ్రకుల సామాజిక నాయకులు అతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఏదిఏమైన మండల రాజకీయాలు మాత్రం రసవత్తరంగానే కొనసాగుతున్నాయి.
ప్రజా సమస్యలకై పోరాటం చేస్తున్నారు
జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ నిరంతరం బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న విజయకుమార్‌కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలి
జాలా పోచయ్య
- ఆటో యూనియన్ నాయకుడు
ప్రాధమిక దశ నుంచే నాణ్యమైన విద్య లక్ష్యం
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్యలో వెనుకబడి ఉన్నారని గుర్తించిన విజయకుమార్ ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలను దత్తత తీసుకొని ఉదార స్వభావంతో పనిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు, చదువుకున్న యువత కూడా విజయ్ కుమార్‌కు అండగా నిలవాలి.
- తుమ్మల రమేష్ ఉప సర్పంచ్, చల్మెడ
సామాజిక సేవా దృక్పథం
సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి విజయ్‌కుమార్ సేవలు మండలానికి ఎంతో అవసరం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసి దళితుల ఆత్మగౌరాన్ని నిలబెట్టారు. ఒకటవ వార్డులో నీటి సమస్య గుర్తించి బోరు మోటారు ఇప్పించి నీటి సమస్యను పరిష్కరించారు. సంఘం కోసం రూ.30 వేలతో గది నిర్మాణం చేశారు.
- టంకరి లక్ష్మణ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు