Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆదివారం నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు లకావత్ రమేష్ నాయక్ సేవారత్న అవార్డును అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఈ అవార్డును లకావత్ రమేష్ నాయక్‌కు అందజేశారు. సేవరత్న అవార్డు అందుకున్న రమేష్ నాయక్ మాట్లాడుతూ తాను చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తనకు జాతీయ సేవారత్న అవార్డును అందించారన్నారు. ఈ అవార్డుతో తనకు మరింత బాధ్యత పెరిగిందని మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని రమేష్ నాయక్ తెలిపారు.