Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీయు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్
నవతెలంగాణ-సిద్దిపేట
ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని ఎస్టీయు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ డిమాండ్ చేశారు. జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల మాదిరిగా పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 317 జిఓ వల్ల తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలలో భాగంగా రెడ్డి గార్డెన్ వనస్థలి పురంలో నిర్వహించే కార్యక్రమంలో సిద్దిపేట శాఖ తరుపున కార్యకర్తలు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి మట్టపల్లి రంగారావు నివేదిక ప్రవేశ పెట్టగా, ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ ఆర్థిక నివేదిక ప్రవేశ పెట్టారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మ్యాడ శ్రీధర్, కల్లెపల్లి శ్రీనివాస్, మద్దుల రవీందర్ రెడ్డి, ఖాతా యాదగిరి, లింగారెడ్డి, నాగభూషణం, భిక్షపతి, రాచకొండ భూపాల్, మంగళంపల్లి శ్రీనివాస్ వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.