Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
శివంపేట మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన సేవ రత్న అవార్డు గ్రహీత, టీఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి బండారి గంగాధర్‌ను ఆది వారం నర్సాపూర్ పట్టణంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయి సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజా రా ఎంప్లాయి సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ బండారి గంగాధర్ ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందిస్తూ ఎందరినో ఆదుకుంటున్నారన్నారు. ముఖ్యంగా పేదింటి ఆడపడుచుల వివాహాలకు పుస్తెమట్టెలు అందజేయడం శుభ పరిణామమన్నారు. ఆయన చేస్తున్న సేవలు మరవలేనివని గుర్తు చేశారు. అందువల్లే ఆల్ ఇండియా బంజారా ఎంప్లారు సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ నాయకులు సామ్య నాయక్, విజయ్ సింగ్, రవీందర్, ధన్సింగ్, తారా సింగ్ ఉన్నారు.