Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
ఇటీవల చేగుంట మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీలలో చేగుంట మండల కేంద్రానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ ఏడవ తరగతి విద్యార్థులు నరేష్, గాయత్రి, మోడల్ స్కూల్ 7వ తరగతి విద్యార్థి లాస్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్పోర్ట్స్ కోచ్ కరణం గణేశ్, రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరిలు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రగ్బీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అండర్ 14 బార్సు టీం కోచ్‌గా నార్సింగి మండలం నర్సంపల్లి తండాకు చెందిన మహేష్ వ్యవహరిస్తారని తెలిపారు. వీరి ఎంపిక పట్ల జెడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు రమేష్, భూపాల్‌రెడ్డి, పీడీలు శారద, వెంకటేష్‌లు హర్షం వ్యక్తం చేశారు.