Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడత కంటి వెలుగు
నవతెలంగాణ-మెదక్ రూరల్
రెండో విడత కంటి వెలుగు కార్యక్ర ఈ నెల 18 నుండి
రెండవ విడత కంటి వెలుగు విజయవంతం చేసేలా అధికారురులు ప్రణాళికలు రూపొందించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మండల ప్రత్యేకాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 31 తేది వరకు ప్రతి మండలంలో 5 నుంచి 6 శిబిరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ శిబిరాల నిర్వహణపై ముందస్తుగా ప్రత్యేక దష్టి కేంద్రీకరించాలని సూచించారు. శిబిరాల నిర్వహణ భాద్యత మండల వైద్యాధికారులదేనని ప్రధానంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ వంటి భవనాలలో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రజలు కూర్చోడానికి కావలసిన ఫర్నీచర్, షామియానా , విద్యుత్, మంచినీరు, శౌచాలయాలు, వెహికల్స్ పార్కింగ్ వంటి కనీస సౌకర్యాలు ఉన్నాయా పరిశీలించి తగు ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకోవాలని సూచించారు. ఆశావర్కర్లు, ఏ.యెన్.ఏం.లు, స్వయం సహాయక సభ్యులు ప్రజలకు అవగాహన కలిగించి కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఒకరోజు ముందుగా టోకెన్లు ఇవ్వాలని, శిబిరానికి వచ్చే టప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకురావాలని తెలపాలని సూచించారు. ప్రిస్క్రిప్షన్ రాసిన వారికి పక్షం రోజులలో కంటి అద్దాలు అందజేస్తామని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సరిగ్గా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సర్జరీ అవసరమైన వారికి రెఫర్ చేయాలని సూచించారు. ఈ నెల 18 న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో శిబిరాలను ప్రారంభించి వారి చేతుల మీదుగా రీడింగ్ అద్దాలు అందించేలా చూడాలన్నారు. రోజు వారి సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలని , ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా వైద్యాధికారి ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, డీపీఓ రాజేంద్రప్రసాద్, మండల ప్రత్యేకాధికారులు జయరాజ్, శ్రీనివాస్, విజయ శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, కేశూరం, కష్ణ మూర్తి, బ్రహ్మాజీ, విజయలక్ష్మి, ఇందిర, నాగరాజ్, కరుణ, ఆశాకుమారి నర్సయ్య, రజిని, భీమయ్య, డాక్టర్ సుమిత్ర, డాక్టర్ నవీన్, 40 బందాల అధికారులు పాల్గొన్నారు.