Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
భారతదేశపు అతిపెద్ద స్కూల్ ఎడ్టెక్ కంపెనీ లీడ్, తమ లీడ్ చాంఫియన్‌షిప్ 2022 విజేతలను వెల్లడించింది. సీనియర్ కోడింగ్ ఛాంపియన్ విభాగంలో సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ విద్యానగర్ సంగారెడ్డి చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఎం.హ్యారీ, జి గౌతమ్‌లు లెర్న్ సోషల్ అండ్ లీవ్ సోషల్ అనే పేరుతో యాప్ డెవలప్మెంట్లో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సెంట్ ఆంథోనీస్ పాఠశాల చైర్మన్ అంథోనీ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్దులతో పోటీపడి విజయం సాధించడం సాధారణ అంశమేమీ కాదన్నారు. అయినప్పటికీ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పాల్గొని విజయం సాధించారన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విజేతలైన హ్యారీ, గౌతవమ్లకు లీడ్ చాంఫియన్‌షిప్ లీడ్ కో-ఫౌండర్, సీఈఓ సుమీత్ మెహతా బహుమతులను, అవార్డును అందజేశారు.