Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎల్పీఓ
నవతెలంగాణ-చేగుంట
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్, హరితహారంపై దృష్టి పెట్టాలని డీఎల్పీఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో శుక్రవారం పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, 15 వేల నర్సరీ మొక్కల ప్లాంటేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శానిటేషన్, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామంలో శానిటేషన్పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో శానిటేషన్పై, అలాగే హరితహారంపై దృష్టి కేంద్రీకరించాలని, గ్రామాల్లో తడి, పొడి చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలకు అవగాహన కల్పించాలని వారు సూచించారు. హరితహారం మొక్కలను ఏపుగా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, సెక్రటరీ ఎల్లం, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.