Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నశంకరంపేట
మండలంలోని జంగరాయి బీటీ రోడ్డు నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారాయి నుంచి శంకరంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.30 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జేసీబీతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ పట్లొరి మాధవి రాజు, పీఆర్ డీఈ పాండు రంగా రెడ్డి, ఏఇవిజరు కుమార్, స్థానిక సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పం చులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.