Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక
దుబ్బాక పురపాలిక కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ అధ్యక్షతన ఏఎంసీ పాలకవర్గం తొలిసారిగా శుక్రవారం సమావేశమయ్యారు. ముందుగా ఏఎంసి నూతన పాలకవర్గ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్ పర్సన్ సిహెచ్.జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం చేపట్టాల్సిన పనులను వెంటనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డ్లో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం, రైతులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తొలి తీర్మానం చేశారు. ఆ పనులను వెంటనే చేపడతామని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి వారి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేద్దామని ఈ సందర్భంగా సభ్యులను కోరారు. ఈ సాధారణ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చెక్కపల్లి పద్మయ్య, ఏఎంసీ డైరెక్టర్లు, కార్యదర్శి జి.పరమేశ్వర్, సిబ్బంది గణేష్, పలువురు పాల్గొన్నారు.