Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-కల్హేర్
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సో మవారం నూతన నిజాంపేట్ మండలంలోని బాచేపల్లి గ్రా మ సంతలో రహదారి భద్ర తా నియమాలను తెలియ జేస్తూ ఇన్స్టంట్ మేనేజర్ (ఐఎంఎస్) కాజా మొయినుద్దీన్, పీఆర్ఓ శివకుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎన్ఏ 161 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అందరూ తప్పనిసరిగా భద్రతా నియమాలను అనుసరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు రాంగ్ రూటు వెళ్లకుండా ప్రమాదాలపై అవగాహన కల్పించడం జరిగింది, మరియు ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తున్న వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణిస్తున్న వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడప రాదని, మొబైల్ ఫోను మాట్లాడుతూ వాహనం నడప రాదని, అలాగే స్థానికులు సర్వీస్ రోడ్డు ను ఉపయోగించుకోవాలని సర్వీస్ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 40 స్పీడు మించరాదని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ అధ్యక్షులు దుర్గారెడ్డి, స్థానిక గ్రామ సర్పంచ్ పద్మ బాపూజీ, పిఎసిఎస్ చైర్మన్ సంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది, పాల్గొన్నారు.