Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్కుక్
సాధారణంగా ఆయిల్ ఫామ్ మొక్క లు నాటిన 14 నుంచి 18 నెలల్లో పూతకు వస్తా యని, ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పాలు పూస్తాయి. తొలి దశలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే, వచ్చే పూలను తీసివేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన మర్కుక్ గ్రామానికి చెందిన రైతు జీవన్ రెడ్డి ఆయిల్ పామ్ తోటలలో పూల గుత్తులను (అబీలేషన్) తీయుటపై మండల వ్యవసాదికారి డా.టి.నాగేందర్ రెడ్డితో కలసి రైతుల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి దశలో వచ్చే పూలను తీసి వేయాలని, ఈ ప్రక్రియ 30 నెలల వరకు చేసుకోవాలని సూచించారు. సంప్రదాయం నూనె గింజల కన్నా ఆయిల్ పామ్ పంట నూనె దిగుబడి 4 నుండి 5 రేట్లు అధికంగా ఉంటుందన్నారు. మొక్కలు నాటిన తరువాత 4వ సంవత్సరం నుంచి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతరంగా దిగుబడీ తో ఆదాయం పొందవచ్చున్నారు.ఆయిల్ పామ్ సాగులో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ సాగుకి డ్రిప్ 90 శాతం, మొక్కలను రాయితీ లను ప్రభుత్వం అందజేస్తుందని, రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా వరి, చెరుకు, పండ్ల తోటలు తప్ప అన్ని పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి చైతన్య శంకర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ అధికారి విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిని కాంత్, విష్ణు, రైతులు తదితరున్నారు.