Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్కుక్
ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలు కొందరి నిర్లక్ష్యం మూలంగా అగ్నికి ఆహుతవుతున్నా పట్టించుకునే వారే లేరు. మండలంలోని దామరకుంట, అంగడికిష్టాపూర్, గణేష్పల్లి శివారులో రోడ్డు కిరువైపులా నాగేళ్ల కిందట నాటిన మొక్కలు ఇటీవల మంటల్లో కాలిపోయాయి. పిచ్చిమొక్కలతో పాటు మొక్కలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. వందల మీటర్ల పొడవునా మొక్కలు దగ్ధమయ్యాయి. మొక్కలు కాలిపోయిన పది రోజులు దాటినా... ఈ విషయం అధికారులకు తెలిన ఇప్పటి వరకు నీళ్లు పోయ్యకపోవటం గమనార్హం.