Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాకరూరల్
ఈ నెల 23న హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యువత -భవిత అనే అంశంపై యువకవులకు కవితా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల సిద్ధిపేట స్నాతకొత్తర తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు యువకవులు పాల్గొన్నారు. వీరంతా ఒక సమూహంలోని 300 మంది కవులతో పోటీల్లో పాల్గొన్నారు. యువత-భవిత పోటీల్లో ఆ సమూహ యువ కవుల నుండి ఉత్తమమైన కవితలుగా 10 కవితలని ఎంపిక చేశారు. అందులో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ముక్కపల్లి సాగర్ ఎంపికయ్యారు. ముక్కపల్లి సాగర్ స్వస్థలం పద్మనాభునిపల్లి పల్లి కాగా... యువ కవి సాగర్ ని శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆదివారం శాలువాతో అవార్డ్ అందజేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషకారమని అన్నారు. భవిషత్ లో మరిన్ని అవార్డులు అందుకోడానికి కృషి చేస్తానన్నారు. మరో వైపు యువ కవి సాగర్ ప్రతిభను మెచ్చి గ్రామస్తులు, తోటి స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.