Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపసర్పంచ్ నూకల వెంకటేశ్‌యాదవ్
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
మురుగు కాలువ మంజూరు అయినప్పటికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా పనులు మొదలు చేయకపోవడంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పనులను చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామ ఉపసర్పంచ్ నూకల వెంకటేశ్‌యాదవ్, వార్డు సభ్యు లు చింతల బాబుముదిరాజ్లు కోరారు. ఆదివారం మురు గు కాల్వను వారు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొండాపూర్ గ్రామంలోని మురుగు కాల్వల నిర్మాణానికి గత రెండు సంవత్సరాల క్రితం గడ, ఈజీఎస్ నుంచి పది లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ సర్పంచ్ చింతల మమత రవిముదిరాజ్ల కృష్టితో నిధులు మంజూరైనప్పటికి నిర్మాణం చేపట్టడంలో కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వారు తెలిపారు. గ్రామంలో మురుగు కాల్వ నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు నీరు పేరుకుని తీవ్ర దుర్వాస నతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే పనులను ప్రారంభించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాకపోవడంతో ఇతర అభివృద్ది పనులకు నిధులు మంజూరు కావాలని కోరితే ఉన్న పనులే పూర్తి చేయలేదని మరిన్ని పనులు ఎలా ఇవ్వాలని అధికారులు అంటున్నట్టు వారు తెలిపారు వెంటనే పెండింగ్ పనులను పూర్తి చేసి గ్రామాభివృద్దితో పాటు ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఉపసర్పంచ్ నూకల వెంకటేశ్‌యాదవ్ కోరారు.