Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250 వారాలుగా కొనసాగుతున్న స్వఛ్చభారత్ 29ఎంఎన్బి01
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
గ్రామాభివృద్ది స్వఛ్చతే ముఖ్యంగా నేచర్ ఐకాన్ యూత్ చేపట్టిన స్వఛ్చ భారత్ కార్యక్రమాలు అభినందనీయమని స్వఛ్చభారత్ ఇతర గ్రామాలకు ఆదర్శం గా నిలుస్తుందని గ్రామ మాజీ కార్యదర్శి సత్యనారాయణ, కార్యదర్శి వేణు గోపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో గ్రామ స్వఛ్చతే లక్ష్యంగా నేచర్ ఐకాన్ యూత్ చేపట్టిన స్వఛ్చభారత్ కార్యక్రమం 250 వారాలుగా కొనసాగుతుంది. ఆదివారం గ్రామంలో 250 వారంను పురస్కరించుకుని యువతతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అలాగే గ్రామం లో ప్రతి ఒక్కరూ స్వఛ్చతపై అవగాహన కలిగి ఉండాలని, గ్రామ అభివీద్ది, స్వఛ్చతపై నినాదాలు చేశారు. అనంతరం చెరువుకు వెల్లే దారితో పాటు రైతు వేదిక వద్ద యువత పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గత 250 వారాలుగా గ్రామంలో అభివృద్దితో పాలు స్వఛ్చత, గ్రామంలో ఉన్న సమస్యలపై పరిష్కారాని కి తోడ్పతున్న యువత నేచర్ ఐకాన్ టీం సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. గ్రామంలో చేపడుతున్న స్వఛ్చబారత్ కార్యక్రమం మండలంలోనే కా కుండా ఇతర మండలాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేచర్ ఐ కాన్ టీం సభ్యులకు గ్రామ ఒకటో వార్డు సభ్యులు శ్రీహరిగౌడ్ పనిముట్లను అందజేశారు. నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు చేపట్టిన స్వఛ్చబారత్కు గ్రామంలోని యువతతో పాటు చిన్నారులు సైతం పాల్గొని మొక్కలు నాటడం, వీధులను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతూ మ్రాభివృద్దిలో పాలు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువతతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.