Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 వెల మంది క్రీడా కారులు ఒకే చోట
- క్రీడా సంబురానికి వేదిక కానున్న సిద్దిపేట స్టేడియం
- సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోపి సీజన్ 3 మ్యాచ్‌ల డ్రా
నవతెలంగాణ-సిద్దిపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా సిద్దిపేట ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ప్రతి ఏటా నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో 378 టీములు పాల్గొంటున్నాయని నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కలకుంట్ల మల్లి ఖార్జున్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డిలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంకు ఏ మాత్రం తీసిపోకుండా సిద్దిపేట స్టేడియంను అభివృద్ధి చేసిన ఘనత మంత్రి హరీశ్ రావుకే దక్కుతుందన్నారు. క్రికెట్లో గుర్తింపు పొందడానికి గ్రామీణ, పట్టణ క్రీడాకారులకు ఈ టోర్నీ ఒక సువర్ణావకాశం కల్పిస్తుందని తెలిపారు.
సిద్దిపేట స్టేడియంలో ఫిబ్రవరి 17న ప్రారంభం కానున్న సీఎం కేసీఆర్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లను అధికారులు, ప్రజా ప్రతినిధులు , టీం కెప్టెన్ల సమక్షంలో డ్రా నిర్వహించి ఎంపిక చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టోర్నమెంట్లో రూరల్, టౌన్ విభాగాలలో మొత్తం కలిపి 378 టీంలు ఎంపియ్యాయని తెలిపారు. టౌన్‌కు సంబంధించి పూల్ ఏ,బీ, సి డి, రూరల్‌కు సంబంధించిన పూల్ ఏ, బి, సి, డి జట్లు వేరువేరుగా పాల్గొంటాయని తెలిపారు. పట్టణం నుంచి ఒక జట్టు రూరల్ నుంచి ఒక జట్టు ఫైనల్లో పాల్గొంటాయి అన్నారు. టోర్నమెంట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన రిఫరీలు ఎంపైర్లుగా వ్యవహరిస్తారని, పూర్తి అంతర్జాతీయ నియమ నిబంధనలతో టోర్నీ కొనసాగుతుందన్నారు. ఈ సారి జాతీయ క్రికెట్ దిగ్గజాలు, టాలి హుడ్ హీరోలతో ప్రత్యేక ఆకర్షణగా సిద్దిపేట క్రికెట్ స్టేడియం వేదిక కానుందన్నారు. దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ గుర్తింపు రానుందన్నారు. ఇదంతా మంత్రి హరీశ్ రావు ప్రోత్సాహమేనన్నారు. స్టేడియం కూడా కొత్త హాంగులతో భారీ స్క్రీన్ తో ఏర్పాటు కానుందని చెప్పారు. టోర్నీ విన్నర్ కు రెండు లక్షల రూపాయల నగదు బహుమతి, రెండవ బహుమతిగా లక్ష రూపాయల నగదుతో పాటు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 50 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మం, అరవింద్ రెడ్డి, కొల రమేష్, ప్రశాంత్ గౌడ్, బిక్షపతి,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.