Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలని చరమగీతం పాడాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జయ రెడ్డి అన్నారు. సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లి గ్రామంలో పార్టీ మండలాధ్యక్షులు బుచ్చిరాములు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 'హత్ సే హత్ అభియాన్ యాత్ర'లో ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జయరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ జెండా ను ఎగురవేశారు. ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రజల సమస్య ల ను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం జయ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాల నను ప్రజల్లో ఎండగట్టడం కోసం హత్ సే హత్ అభియాన్ యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌తోనే బీఆర్ఎస్ పాలన అంతం సాధ్యమన్నారు. సంగారెడ్డి ఎంపీపీ లావణ్య దుర్గేష్, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, రఘు, రామ్ గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకుడు నవీన్‌కుమార్, సంగా రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.