Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు
- మాకు న్యాయం చేయాలి
- మెదక్ పట్టణానికి చెందిన ఓ మహిళ వేడుకోలు
నవతెలంగాణ-మెదక్‌రూరల్
'దొంగతనం చేశాడనే అభియోగంతో నా భర్తను పోలీ సులు విచక్షణారహితంగా చితకబాదారు. ఇప్పుడు ఆయన తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడు.' అంటూ మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తన గోడు వెల్లబోసుకున్న ఘటన గురు వారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం అరబ్గల్లికి చెందిన ఓ మహిళ మెడలో నుంచి బంగారం దొంగలించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీ లించగా.. హైదరాబాద్‌లో పని చేసుకునే స్థానిక మెదక్ పట్టణం పిట్లం బేస్ వీధికి చెందిన మహమ్మద్ ఖదర్ ఖాన్‌పై అనుమానం కలిగింది. దీంతో అతడిని గతనెల 29న పోలీ సులు విచార ణ పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టారీతిగా లాఠీ ఝులిపిం చారు. ఐదు రోజుల విచారణ తరువాత ఈనెల 2న వదిలిపెట్టారు. కాగా బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ఇష్టారీతన కొట్టడం తోనే తన భర్త కిడ్నీలు దెబ్బతిన్నాయని, చేతులు పనిచ ేయడం లేదని బాధితుడి భార్య సిద్దేశ్వరి ఆరోపించింది. ఎలాంటి తప్పు చేయకున్నా హైదరాబాద్‌లో పనిచేసుకునే తన భర్తను పోలీసులు అకారణంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన భర్త పరిస్తితి విషమంగా ఉందని, ఈ విషయంలో పోలీసు ఉన్నతాధి కారులు విచార ణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషj ుమై తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 6న కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.