Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయ కులు గురువారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జాతీయ బీసీ కమిషన్ చైర్మెన్ శ్రీ హంసరాజ్ గంగ రాజ్ అహీర్ను కలిసి వీర శైవలింగాయత్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందజేశారు. సామాజికంగా ఆర్థికంగా ఎన్నో ఏండ్ల నుంచి వెనుకబడిన వీర శైవలింగాయత్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. శ్రీ చంద్రశేఖర్ మాజీ మంత్రి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజరు గనాటి, రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడ సంగప్ప, జగిత్యాల జిల్లా ఇన్చార్జ చంద్ర శేఖర్, మెదక్ పార్ల మెంట కో కన్వీనర్ కొవ్వూరి సంగమేశ్వర్, బీజేపీ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ జిల్లా ప్రధాన కార్య దర్శి నవబాద్ జగన్నాథ్, మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, సం గారెడ్డి పట్టణాధ్యక్షులు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.