Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
దృష్టి లోపాలను నివారించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం సందర్శించారు. సంగారెడ్డి లోని ఇంద్ర నగర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. ఏ విధంగా నమోదు చేస్తున్నారన్నది, అదే విధంగా కంటి పరీక్షలు చేసుకుంటున్న మహిళలను పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి రోజు ఎంత మంది వస్తు న్నారు, కంటి అద్దాలు, మందులు సరిపడా స్టాక్ అందు బాటులో ఉన్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. శిబిరం వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. శిబిరానికి వచ్చే వారికి మెరుగైన సేవలం దించాలని ఆదేశించారు. ప్రతి రోజు కనీసం 250 మదికి కంటి పరీక్షలు చేయాలని, బాగా చూడాలని సూచించారు. అనంతరం కంటి పరీక్షలు చేయిం చుకున్న మహిళలతో కలెక్టర్ ముచ్చటించారు. ఇక్కడ కంటి పరీక్షలు చేస్తున్నట్లు ఎవరు చెప్పారు? ఎలా చూస్తున్నారు అంటూ అడిగారు. ఏఎన్ఎం, అంగన్వాడి టీచర్ ఇంటికి వచ్చి చెప్పారని, ఈరోజు వచ్చి చూపిం చుకున్నానని కలెక్టర్కు తెలిపారు. పైసలు లేకుండా ఫ్రీగా మంచిగా చూస్తున్నారని, తనకు దూరం చూపు కు సంబం ధించిన అద్దాలు అవసరమని చెప్పారని,వారంలోగా అద్దాలు రాగానే ఇస్తారని చెప్పినట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్వహి స్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని కలెక్టర్ వారికి సూచించారు. కలెక్టర్ వెంట డా.శశాంక్ ఉన్నారు.