Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధానిని కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే తప్పులేదు...
నేను సీఎంను కలిస్తే తప్పా అంటు జగ్గారెడ్డి ఎదురుదాడి
- కాంగ్రెస్ శిబిరంలో రాజకీయ రచ్చ
- మారుతోన్న సంగారెడ్డి నియోజకవర్గ రాజకీయాలు
- 'చింతా'కు అనారోగ్య సమస్యలు... బీఆర్ఎస్లో గట్టి అభ్యర్థి ఎవరనే చర్చ
నిప్పు-ఉప్పు మాదిరి చిటపటలాడే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎం కేసీఆర్.. పాలునీళ్లలా కలిసిపోనున్నారా..? అంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వాళ్లిద్దరు భేటీ అవడంతో.. అవుననే చర్చ నడుస్తోంది. సంగారెడ్డి నియోజ కవర్గ అభివ్పుద్ధి పనుల కోసమే కలిశానని జగ్గారెడ్డి ఎంత గట్టిగా చెప్పినా.. రాజకీయ ప్రాధాన్యత ఎదో ఉండి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం పట్ల ఎంతో ఘాటైన విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఏడాది కాలంగా కాస్త మెతక వైఖరి అనుసరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పథకాలను అభినందిస్తూ మాట్లాడారు. మరో పక్క కాంగ్రెస్‌లో ఉంటునే రేవంత్‌రెడ్డిపై దిక్కార స్వరం విని పిస్తునూ వస్తున్నారు. ఈ రెండు పరిణామాల నేపథ్యంతో తూర్పు జగ్గారెడ్డి పార్టీ మార్పు అనేది ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
గురువారం శాసన సభామావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌తో సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్‌గా ఉన్న తూర్పు జగ్గారెడ్డి బేటీ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా సంగారెడ్డి నియోజవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవడం సర్వసాధారమైన విషయమే కానీ..! బేటీ తర్వాత జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయి. బీజేపీకి చెందిన ప్రధాన మంత్రిని కాంగ్రెస్ ఎంపీలు డైరెక్టుగా చాటుమాటుగా కలిస్తే తప్పు లేదు కానీ..! తాను సీఎం కేసీఆర్‌ను కలవడం తప్పా అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌లో తనకు నచ్చని రేవంత్‌రెడ్డి గ్రూపుపై ఎదురుదాడి చేశారు. ఈ వాక్యలతో జగ్గారెడ్డి రాజకీయంగా కీలక నిర్ణj ుమే తీసుకునే అవకాశముందనే చర్చ నడుస్తోంది. మియాపూర్-సంగారెడ్డి వరకు మెట్రోలైన్ వేయాలనే విషయం గురించి జగ్గారెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలకేమీ చేయలేకపోతున్నారు. అందుకే సీఎంను కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ లేఖ ఇచ్చి ఉంటారు. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ మీడియా ముందు చేసిన కామెంట్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో కాంగ్రెస్ శిబిరంలో రాజకీయ దుమారం లేపుతోంది.
మారనున్న సంగారెడ్డి రాజకీయం...
సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ఆశక్తికరమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్నప్పటికీ స్వపక్షంలో విపక్షం అన్నట్లుగా ఉంటున్నారు. మరో పక్క మంత్రి హారీశ్‌రావును ఇటీవల పలుమార్లు కలిశారు. జనవరిలో జరిగిన జెడ్పీ సవేశంలో నియోజకవర్గ సమస్య గురించి మంత్రిని కలిసి లేఖ ఇచ్చారు. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలిపేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సభలో మాట్లాడిన జగ్గారెడ్డి కేసీఆర్ కిట్, మెడికల్ కళాశాల మంజూరు ఇతర పథకాల్ని అభినందించారు. మూడు రోజుల వ్యవధిలోనే నేరుగా సీఎంతో బేటీ అయ్యారు. ఇవన్నీ రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చింత ప్రభాకర్‌కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఒక వేళ మరోకర్ని బరిలో దించాల్సి వస్తే ఎవరనేది బీఆర్ఎస్లో చర్చ నడుస్తుంది. డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న పులిమామిడి రాజు బీఆర్ఎస్ను వీడే అవకాశముంద ంటున్నారు. గెలుపు గుర్రాల వేటలో సంగారెడ్డిలో జగ్గారెడ్డియే మేలు అనుకుంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇస్తారేమో అనే చర్చ ఊపందుకుంది.