Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణఖేడ్
శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ నారాయణఖేడ్ డిపో ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెండ్లిళ్లకు, శుభకార్యాలకు 10 శాతం రాయితీతో బస్సులను అద్దెకు ఇవ్వ నున్నట్టు డి.ఎం మల్లేషయ్య తెలిపారు. మహాశివరాత్రి సంద ర్భంగా నారాయణఖేడ్ నుంచి ఏడుపాయలకు 6, బోడు మెట్పల్లి నుండి 6, (జే)శంకరంపేట్ నుంచి కొప్పల్కు 3 బస్సులను నడపనున్నట్టు తెలియజేశారు. 16వ తేదీ నుంచి 22వ తారీకు వరకు ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయన్నారు. చుట్టు పక్కలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. సహాయక మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లా డుతూ.. నలభై మంది ఒకే దగ్గర ఉంటే.. అక్కడికే బస్సును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. బస్సుల బుకింగ్ కోసం9441071134, 9182969302, 9949939489 లను సంప్రదించాలన్నారు. అకౌంటెంట్ చందు, మార్కె టింగ్ సెల్ ఇన్చార్జి పాండు, బోరిగి శంకర్ పాల్గొన్నారు.