Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యాల్కల్
మండంలోని హుస్సేన్‌నగర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ బబ్ల నూత న గృహప్రవేశ వేడుకలో టీఎస్ ఏంఏస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం అత్నూర్లో వైస్ ఎంపీపీ గౌసోద్దిన్ ఇంటికి వెళ్లి తేనెటీ విందును స్వీకరించారు. త దనంతరం మైనోద్దీన్ను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అటు పిమ్మట ముంగి చౌరస్తాలోని ఎస్ఎల్ఆర్ గార్డెన్లో ముస్తఫా కుమారుడి వలిమా వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్వీర్‌తో కలిసి పాల్గొని నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ న్యాల్కల్ మండల నాయకులు శాలువాతో సన్మానించారు. మాజీ జెడ్పిటిసి చంద్రప్ప, వైస్ ఎంపీపీ గౌసోద్దిన్, నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రఫీయోద్దిన్, మిర్జాపూర్ (బి) షఫీయోద్దీన్, మాజిద్ పటేల్, భూమారెడ్డి, శేఖర్ రెడ్డి, కుతుబుద్దిన్, అనీఫ్, రేషన్ డీలర్ల అధ్యక్షులు పాండురంగారెడ్డి, మాజిద్ , అబ్దుల్ రహీమన్, యువ నాయకులు ముస్తఫా, నసీర్ తదితరులు ఉన్నారు.