Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 శివలింగాల అవతారాలకు భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం
- ప్రముఖ గాయనీ గాయకులతో సంగీత విభావరి
- ఇస్నాపూర్ చౌరస్తా నుంచి కార్యక్రమ వేదిక వరకు శోభ యాత్ర
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు
నవతెలంగాణ-పటాన్చెరు
మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 18న రాత్రి చిట్కుల్లో నిర్వహించే శివోత్సవం కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. ఈనెల 18న హెచ్ఎంటీవీతో కలిసి నిర్వహించతలపెట్టిన శివోత్సవంపై ఎంఎన్ఆర్ యువసేన సభ్యులతో చిట్కుల్లో జరిగిన సమావేశంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులకు దిశానిర్థేశం చేశారు. కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఉండాలని, అక్కడే నిలుపుకునేలా యువసేన సభ్యులు చూడాలన్నారు. కార్యక్రమం నిర్వహించే మల్లన్నగుడి ప్రాంగణంతో పాటు చిట్కుల్ గ్రామం మొత్తం శివనామస్మరణ తో మారుమో గాలన్నారు. చిట్కుల్ లో ఆ పరమశివుడే తాండవించిన అనుభూతి భక్తులకు కలగాలన్నారు. 12 శివలింగ అవతా రాలకు భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం ఉంటుందని, నర్మదా నది నుంచి శివలింగాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. శివపా ర్వతులకు ఇస్నాపూర్ చౌరస్తా నుంచి కార్యక్రమ వేదిక వరకు శోభయాత్ర ఉంటుందని తెలిపారు. శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ సమయంలో అభిషేకం, హౌమం, మహన్యాస రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావ రణంలో జరుగుతాయన్నారు. గీతామాధురి, శ్రీకృష్ణ, రేవంత్, సాహితీ చాగంటి, మధు ప్రియ వంటి ప్రముఖ గాయనీగాయకులచే సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న శివోత్సవం కు వేలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంతో ఎంఎన్ఆర్ యువసేన సభ్యులు భక్తి భావంతో సేవకులుగా పనిచే యాలని సూచించారు. కార్యక్రమంలో పటాన్ చెరు నియోజక వర్గ ఎన్ఎమ్ఆర్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.