Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక కోడుల రద్దు కోసం కేంద్రంపై పోరాటం
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్
నవతెలంగాణ-పటాన్చెరు
పెరుగుతున్న ధరల కనుగుణంగా కనిస వేతనాలు పెంచాలని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన సీఐటీ యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మల్లికార్జున్ మాట్లా డారు. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాల మూలంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఉప్పు, పప్పు, బియ్యం నిత్యవసర సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన చెందారు. ప్రస్తుతమున్న ధరలకు అనుగుణంగా ఒక కార్మికునికి ఎనిమిది గంటలు పని చేస్తే కనీసం రూ.26 వేలు వస్తే గాని కుటుంబం గడిచే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల మూలంగా కార్మికులు రోడ్డు పాల య్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసే ప్రయత్నంలో భాగమే లేబర్ కోడుల మార్పు అని విమ ర్శించారు. ఈ విధానాలపై సీఐటీయూ అన్ని కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన విషయం గుర్తు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతు.. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం లో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పరిశ్రమల యజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తు కనీస వేతనాలు, ఈఎస్ఐ,పిఎఫ్, బోనస్, సెలవులు ఇవి ఏమి అమలు చేయట్లేదన్నారు. కార్మికుల సమస్యలపై సీఐటీ యూ నెల రోజులపాటు పెద్ద ఎత్తున క్యాంపియన్ తీసుకు న్నదని మార్చి 1న లేబర్ కార్యాలయం ముట్టడికి పిలుపుని చ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని.. లేని యెడల కనీస వేతనాల పెంపుదల కోసం కార్మికవర్గం ఐక్యంగా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కోశా ధికారి నర్సింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, నాయకులు విఎస్ రాజు, తిరుపతి, జయ కుమార్, సుధా కర్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్, విష్ణు పాల్గొన్నారు.