Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మౌత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మౌత్స వాల్లో రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు అత్యంత కీలక ఘట్టం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఆగమపండిత వేదాంతి రంగనాథ ఆచా ర్యులు, వారి శిష్య బందం, ఆలయ అర్చకులు అనంతయ్య ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్యన నిర్వహించారు. స్వామివారి కళ్యణోత్సవంలో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ క్రతువును వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజన ప్రసాదాలు స్వీక రించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న నాయకులు చంద్రారెడ్డి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్ గోపాలమ్మ, ఆలయ కమిటీ సభ్యులు ధర్మ రెడ్డి, పెంటారెడ్డి, మున్సిపల్ నాయకులు రమణయ్య, చంద్రారెడ్డి, వెంకటయ్య, బాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.