పోయెట్రీ
నాన్న దేన్నీ పట్టించుకోడు,
మనకోసం ప్రతిక్షణం ఎంతగా తపిస్తాడో
మాసిన ఆ గడ్డాన్ని అడిగితే తెలుస్తుంది!
నాన్న ఏ పనీ చేయడు,
జీవితంలో ఎంత అలిసిపోయాడో
ఆ మూడోకాలును అడిగితే తెలుస్తుంది!
నాన్న ఇంటికెప్పుడూ ఆలస్యంగా
నాన్న ఓ బ్రహ్మ
జన్మకు కారణమవుతూ !
నాన్న ఓ స్నేహితుడు
చిన్ననాటి నుండి నీతో ఆడుకుంటూ!
నాన్న ఓ నిచ్చెన
ఎదుగుదలకు మెట్లు అవుతూ !
నాన్న ఓ గురువు
నిరంతరం జీవితపాఠాలు బోధిస్తూ !
నాన్న ఓ మా
అబ్బే లేదండీ
నాన్నంత గొప్పోడేంగాదు
సరిగ్గా లెక్కలే రావు
అప్పులెప్పుడూ తక్కువజేసి చెప్పేవాడు!
బడిదారిలో ఎందరో
నాన్న గురించి అడుగుతుంటే
అబ్బ ఊరంతా స్నేహితులే అనిపించేది
అబ్బే లేదండీ.. ఇంటికొచ్చి
లెక్కలేవ
దేశం ధగధగా వెలిగిపోతోందని
అతడంటున్నాడు,
అది ఆరని చితి మంటల వెలుగని....
వేల కోట్ల విగ్రహపు
శిఖరాగ్రం నుండి స్పష్టంగా
కనిపిస్తుందని అతడికి,
''నువ్వూ చెప్పకు, నేనూ చెప్పను''
ఏపుగా పెరిగిన గడ్డంలో
అతడు ర
నీ తనువు నిండా
అణువణువు
ఓ పువ్వుల తావినై
విచ్చుకుంటా...!
నీ దరహాసపు
నవ్వులకు
నింగిలోని నెలవంకనై
అనునిత్యం చెంత చేరుతా..!
నీ చెవిలా
దుద్దులకు కుందనమై
తీరని అందాలను
అంటు పెట్టుకుంటా.
నీవు
బువ్వలోని గంజిని వార్చే సిబ్బివై
కుండను నిలిపే చుట్ట కుదురువై
ఇంటివాసానికి వేలాడే ఉట్టివై
బాయి మన్ను మోసే మట్టి తట్టవై
పల్లె జీవనంలో ఓ వెలుగు వెలిగిన
నీ హస్తకళ అపురూపం, అపూర్వం!
నీవు
పెండనెత్తె పె
జీవితం గాడి తప్పి
గమ్యం తెలియక నిశ్చేష్టుడినై
దారితెలియక రహదారి కూడలిలో
తచ్చాడుతున్న దశలో
ఆదుకుని హత్తుకున్నది మీరే!
ఉద్వేగాలలో, ఉత్సాహాలలో
ఒంటరితనం సాలెగూడులో
చిక్కి గింజుకుంటున్న వేళల్లో
భరించలేని దు
నా కళ్ళు సరిగ్గా విప్పారక ముందు నుండే చూస్తున్న,
ఎన్నో అద్భుత ప్రేమమూర్తులను పరిచయం చేసినరు
నా గొంతు మాటలు పలకనప్పటి నుండి చూస్తున్న, ఎంతోమంది సంస్కర్తలను చూపినరు
మరి ఇప్పుడు ఈ వీధులకు ఏమైంది..!?
నా చేతులు బలంగా పట్టలే
ఎప్పటిలానే
ఋతు ధర్మపు క్రమశిక్షణ తప్పని
భూమధ్య రేఖ..
నడినెత్తిన సూరీడు మంటలు !
స్వంత ఊరు
పరుగులో పిడచకట్టిన నాలుక
ఆకలి సెకలకు కాలుతున్న పేగులు..
రహదారులపై..
రక్తమోడుతున్న పాదపు గుర్తులు !
ఆర
వేగంగా వచ్చి గాలి
నిదురోతున్న కళ్ళను తట్టిలేపింది
వెన్నెల కురుస్తున్న రేయి కిటికీలోంచి
అద్భుత చిత్రంలా కనిపిస్తోంది
ఆకాశం !
వెన్నెల గాఢతను మోయలేక
చందమామను
బావిలోకి విసిరేసింది
నింగిలో
పల్లవి :
మందుకు బందేదీ...అ అ
మందుకు బందేదీ
ఏదీ... షాపుకు క్లోజేదీ...
వైనుకు మరుగేదీ ఏదీ... ఈ... ఈ..
వైనుకు మరుగేదీ ఏదీ...
బ్రాందికి భ్రాంతేదీ
మందుకు బందేదీ... అ అ
ఏదీ... షాపుకు క్లోజేద
బుక్కెడు బువ్వ
గుక్కెడు నీళ్ళు
గుట్టమీద ఆవాసం
కష్టాలతో సావాసం!
తెల్లారకమునుపే తండ్లాట మొదలు
తెల్లారితే తడారే ఊటచెలిమెలు
త్వర త్వరగా తెములు
వేసవి ఎండలు! కమ్మరి కొలుములు!!
రాదారిలో కరమగాల కాపు
ఓ... ప్రజా పాలికలారా....!
ప్రజాస్వామ్య పరిరక్షణలో మీ పాత్ర ఎంత...!
మీ పాలన ఎంత బేషుగ్గా ఉందో
మీకు మీరే భుజాలు చరుచుకుంటు
మీకు మీరే కితాబిచ్చుకుంటు
మాటల గారడీలతో మాయ చేస్తు
ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతూ
ప్రజా వాహ
మన కోసం సృష్టించబడిన ప్రకతికి
మనమే శత్రువులుగా మారిపోయాం..
దైవాలైన పంచభూతాల్ని కూడా
కలుషితంతో నింపేశాం..
నిస్వార్ధంగా ప్రాణవాయువునిచ్చే
పచ్చని చెట్ల ప్రాణాలని
స్వార్థం కోసం ఏనాడో మింగేశాం..
ఊపిరి పోసే వాటి ఉసు
భయపడకు.. ఆనందపడిపో..
ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి
ఓ రాజా.. నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం
ఓ రాజా.. అడవి అంతా బూడిదయ్యింది,
ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,
ఓ రాజా.. బతికించే వాళ్ళు లేరు,
శవాలను
మరో వ్యక్తి నను విడిచిపెట్టి
చాలా దూరంగా వెళ్లిపోయింది
ఇలా ఇదేమైనా తొలిసారి జరిగిందా
ఈ కాలమెప్పుడైన ఎవరికోసమైన ఆగిందా..?
తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోడానికి
నా వర్తమానాన్ని తొక్కేసింది
నా స్వప్నాల్ని కాలరాసి కా
ఒంటరిగా మాట్లాడుకోవడం...
కదులుతున్న దశ్యాల ముందు
నన్ను నేను ఆవిష్కరించుకోవడం
మౌనచెట్టుపై మాటల రెక్కలు అల్లాడిస్తూ
ఒక సన్నని తీగ నుండి మాట రూపాంతరం చెందడానికి,
గట్టు తెగిన మాట నిర్మలంగా... నాలో ఇంకిపోడానికి
ఇంకిపోయిన
నిన్నటి వరకు ఆమె నాకు బడిలో
పాఠాలు బోధించిన పంతులమ్మ
ఈరోజు ఆమె అనుకోని విధంగా
ఫోటోలో శ్రద్ధాంజలి ఘటింపబడుతు
నాతో కన్నీళ్లు పెట్టిస్తోంది!
ఇంతకు ముందే అతను నాకు
ఆసుపత్రిలో డాక్టర్‌గా మారి
ఇంజక్షన్&zwn
పల్లవి : ఆగదు ఏ పన్ను నీ కోసమూ
ఆగితే సాగదు ఈ ప్రభుత్వము
ముందుకు సాగదు ఈ ప్రభుత్వమూ !
చరణం-1: జీతమ్ తక్కువని, ధరలు పెరుగునని
తెలిశినా కొత్త పన్ను రాక ఆగదు !
కారు చవక అని
డీజిల్ దొరుకునని తెల
చివరి అంకం మొదలు కాగానే
రంగస్థలం కుప్పకూలింది
నరుని నాటకానికి తెర పడింది
పాత్రలన్నీ చెల్లాచెదురై
వెంటిలేటర్ల పై గంటలు లెక్కిస్తున్నాయి
అందరూ ఒకరి దుఃఖాన్ని ఒకరు తుడుచుకుంటున్నారు
పాత్రధారులు కొందరు పారిపోయి
ఉక్రోషం ఉప్పెనౌతోంది..
గుండె మండిపోతోంది..
ఏదో చేసేయ్యాలన్న కసితో
నరం నరం సమాయత్తమవుతోంది..
ఏళ్ళ తరబడి అదే మోసం
అదే దోపిడి..
కరెన్సీ భాషే సర్వామోదం
కాగితాలతోటే అన్నీ కప్పెట్టెయ్యడం..
జానెడు పొట్ట
ఎలా చేసారో కదా
ఏళ్ల కొద్దీ ప్రపంచ యుద్ధాలు
రాష్ట్రం అనీ, స్వేచ్ఛ అనీ
గాలిలో లెక్కలేని ప్రాణాలెట్ల వొదిలేశారో కదా
పిట్టల్లా రాలిపోతున్న సంఖ్య
గుట్టల్లా పెరిగిపోతుంటే
భయం తాలూకూ రంగు మారిపోతున్న వేళ
నాలుగు గోడల మధ
శ్మశానం రోడ్డుపైకొచ్చేసింది
మానవత్వమేనాడో చేసిందా పని
వైద్యం వ్యాపారం స్నేహంగా
ఒకదాని భుజంపై ఇంకొకటి
చేతులేసుకొని సంచరిస్తే
సేద తీరేందుకు పడక
పీల్చేందుకు ఆమ్లజని
ధరల ట్యాగులతో దర్శనమిచ్చి
ముసుగేసుకున్న మనిషి
ఒంటరితనం శాపమనుకుంటున్నావా
ఆలింగనాలు, అనురాగం పంచేందుకు
నీకోసం ఎవరు లేరనుకుంటున్నావా
నీలోకి నువ్వు చూసుకునే మధురక్షణాలు
ఇప్పుడు నీ ముందే ఉన్నాయి
అన్ని ఆనందాలను ఒడిసి పట్టుకో
నీ ఇంటిముందున్న సన్నజాజి పాదులో
ర
నిమ్మలం అంటూనే
ఊహల ఉయ్యాలలో
కొత్త దారి వెతుక్కుంటూ
మెత్తగా జారుకుంది
కొన ఊపిరి.
ఉన్నపళంగా వెళ్లిపోయాక
నేటితో ముగిసింది
నిన్నటి రేపు
కన్నీటితో నిండింది
చివరి చూపు.
పరిచయాన్ని గుర్తుచేస్త
నేను నా గదిలో ఒంటరిగా పిచ్చుక గూళ్ళు కడుతుంటాను
పుల్లా పుడకలు నా అక్షరాలే అవి నా బాల్యంలో చిట్లినవేే
యవ్వనారంభంలో నా చూపులన్నీ వాటి మీదే
నాకళ్ల ముందు వెనకా సూర్యోదయాలే
నేనే సూర్యుడ్ని చంద్రుడ్ని నక్షత్రాన్ని
నా ప్రత
ఎప్పటిలాగే
రైలు కిటికీ పక్కనే
చూపుల రెపరెపలు.
దశ్యాల తుప్పర్లకు కళ్ళు
వర్షంలో తడిసిన కుందేళ్లులా
అందాలన్ని తిరుగుతుంటే,
పుస్తకంలోని పేజీల్లా పరిసరాలను చదేవేస్తున్న ఆలోచనలు
రైలు వేగంతో సమానంగా దూసుకెళ్తుంటే
చెట్టు మాట్లాడే పూలభాష
నదీగట్టుకు తెలుసు!
నా మనసు మాట్లాడే ప్రేమభాష
నీ ఎదపుట్టకు తెలుసా?
నీ ప్రేమ ఒక విషసర్పం!
నా ప్రాణం ఒక విలువైన పుష్పం!
నువ్ బుసకొట్టినపుడెల్లా...
నా ప్రాణపుష్పం రాలిపోయింది!
అర చేతిలో సెల్ ఫోన్
ఉంటే చాలు
దోస్తులతో దినమంతా
సొల్లు కబుర్లకిక కొదువే లేదు
కళ్లముందున్న వాళ్ళను
ఎంతకి గుర్తు పట్టలేక పేర్లను
మరిచిపోతున్నారుజి
నిలబడిన చోట నిలబడకుండ
అమాంతం తూ
అతివల అందాలకి
అదనపు సొగసులద్దడాన్కి
అదొక ఆకర్షనౌతుంది.
పదిమంది ముందు
పసివాడి ఆకలితీర్చడాన్కి
అది ఓ పవిత్ర ఆభరణమౌతుంది.
తన కన్నీళ్ళనే కాదు
ఆపన్నుల కన్నీళ్ళు తుడుస్తూ
ఓదార్పునిచ్చే ఆలంబనవుతుంది.
పాస్ అనగానే.. సంబురపడకు.
సక్సెస్ అనగానే.. ఉప్పొంగిపోకు.
కష్టపడకుండా వచ్చే విజయం,
ఆపదలో... హ్యాండ్ ఇచ్చును.
అడపాదడపా..
తెలివితేటలు,
అందరిలో నిన్ను,
బకరాను చేయును.
లక్కును నమ్ముకోక
ప్రతిపక్షములోన ప్రశ్నించే గొంతుక
గెలుపు తదుపరి కండువతో పాటు
పాలకపక్ష గొంతుకగా మారే
నాయకుడి ధర్మమేల
అవినీతి కంపు లో తానెదుర్కొన్న
ఇబ్బందులు మరిచి
తానే ఉద్యోగి అయ్యాక
లంచావతారమెత్తె ఉద్యోగి ధర్మమేల
<
అదుగో చూడు!
అల్లంత దూరాన కొండలు
కావవి కొండలు
నింగి తల్లి
నేలమ్మకు ఎత్తిన బోనాలు!
కొండలను చూస్తే
అచ్చం భోనాల వరుసలే!
ఎవరో ఎత్తుకవచ్చి పెట్టిన
అక్షయ పాత్రలే!
సూర్య బింబం
బోనా
మీ ఆకాశం నుంచి
సూర్యుణ్ణి చంద్రుణ్ణి
ఇవ్వమని అడగను.
మీ వ్యవసాయ క్షేత్రాన్ని,భూమిని
మీ ఎత్తైన భవనాలను
మీ దేవుళ్ళను మీ ఆచారాలను
కులాలను తెగలను
తల్లిని సోదరీమణులను కూతుర్లను
అడగను.
మనిషిగా నా హక్కులను మాత్
అమ్మా! భారతమాతా!
నువ్వు దాస్య శంఖలాలు తెంచుకొని
రెక్కలు విప్పుకున్నాక
నేను కళ్ళు తెరిచాను.
ఈ సంగతి నీకు తెలుసు లోకానికి తెలుసు
నాకూ తెలుసు
కానీ ఇన్నాళ్ళకు,
నేనిప్పుడు డియన్ఏ టెస్ట్ చేయిచుకోవాలట !
మాటల తేనెలు పూసి
మెత్తగా కోసే ప్రయత్నం
ఉపమానాల వెన్నెలలు పరిచి
శ్రమ దోపిడి చేసే వైనం...
సూరీడికి హారతి పట్టి
కోడి కూయకముందే
ఇల్లూ వాకిలిని దిద్దే ఇల్లాలి
బతుకంతా మౌన సాగరం
గగన వనంలో వెలుగు కిరణమ
మనమంతా హిందువులం
సింధూ నది బిందువులం
రక్త బంధువులం
హిందువుగా జీవించు
హిందువుగా గర్వించు అంటారే....
మరెందుకు? మా ఊరి గుడిలో మాకు చోటుండదు!
మేమెట్లా గర్వించాలి?
దేశాధ్యక్షుడనైనా
హిందువునైనా
అంటరాని
రేపటి భయాల్ని తప్ప తాగి
కొరికలపై కాలు జారి
కళ్ళు తిరిగిన తలపులు
వర్తమానం కింద నలిగిపోతూ
నిలువుగా చీలిన మనిషి
రెండు చేతులతో
ప్రోగు చేసుకున్న ఆశలను
మెదడు పొరల్లో కన్నీటి ద్రావకంలో దాచి
కలల దువ్వలో
కలత దుమ
కనుపాపను ఆవరించిన
చీకటి కాటుక
జారిపోయే మెలకువను లెక్క చేయక
స్వప్నాల వీధికి లాక్కెళ్తుంది
చుక్కల తోపును తప్పుకుంటూ
ఆకాశ దండానికి వేలాడుతూ తక్కెడ
తనతో సరిదూగమంటూ
పదాలకు సవాలు విసురుతోంది
తూకానికి క
అవని గమనానికి ఆధారమైన సూర్యచంద్రులే నిద్రాహారాలు మాని పయనిస్తుంటే మనిషి మాత్రం మత్తులో జోగుతూ సోమరి అవుతున్నాడు..
మానవత్వం ప్రదర్శించాల్సిన హృదయాలలో ఎప్పుడు స్వార్థం అడుగంటునో ఎక్కడ క్రమశిక్షణ జనించునో సమయపాలనా మార్గాన సాగాల్సిన జీవితం ఎన్నడ
నీరు ప్రాణ కోటికి జీవనాధారం
ప్రకృతి వనరుల్లో అతి ముఖ్యం
పంచభూతాల్లో అత్యంత ప్రధానం
జీవకోటి మనగడకు ఆధారం
భూలోకంపై ప్రాణకోటి వృద్ధికి
జీవన ఆధారం
ఆహారంగా మానవాళికి ఒక అద్భుత వరం
ఈ నీరే లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థ
మనసులోని ఆవేదన
విశ్వమంత విస్తరించినా
కన్నీటి బొట్టుగా రాలిపడితేనే
గుండె బరువు తగ్గేది,
ఒక్కో బొట్టూ
వెచ్చని అడుగులేస్తూ
ఓదార్పు తీరం చేరుతుంది!
మౌనం మొలకెత్తుతుంటే
శూన్యపుతీగలుజి
దేహమంతా అల్లుక