పోయెట్రీ
కుప్పగా పోసి తగలబెడితే
నిముషం కూడ పట్టకుండ
తగలబడి బూడిదయ్యే కాగితపు
నోట్ల కట్టలను చూసి తెగ మురిసి పోతుంటావు!
పైస పైస కూడ బెట్టుకొని పైకొచ్చిన
నేను ఇతరులకు పరోపకారం చేయడమే ధర్మమని నాకు మాత్రమే తెలుసు!
పగటి కన్నా
రాత్రి అంటే నాకు భలే ఇష్టం
నేను కష్టపడేది
మరి రాత్రి పూటే
రాయడం నేర్చుకున్న నేను
బతుకును దాయడం నేర్చుకోలేకపోయా
కొందరందుకే,
నేనేదో నేరం చేసినట్టు
వీడింతేనా అని చూసే చూపులు
భవిష్యత్&zwn
ప్యాలెసుల్లాంటి కొంపలు
సూక్ష్మ సైజుల్లో కుటుంబాలు
పెరుగుతున్న విద్యార్హతలు
తరుగుతున్న లోక లౌక్యాలు !
ఆత్యాధునిక ఔషధాలు
అరిగి పోతున్న ఆరోగ్యాలు
చందమామపైనా అడుగులు
ఇరుగుపొరుగులే అపరిచితులు !
వాడు బరువును మోస్తున్నాడా
బరువే వాడి భుజాన్ని మోస్తుందా
చిత్తు కాగితాల చెత్తకుప్పల మధ్య
ముక్కుపచ్చలారని బాల్యం
బిక్కుబిక్కుమంటూ
బరువైన జీవితాన్ని మోస్తోంది
అరటితొక్కల మధ్య
అసహ్యకరమైన పెంటకుప్పల మీద
బాల్యం వ
వాన కురిసే ముందు
తల్లడిల్లుతున్న మబ్బు
ఏదో పనిమీద జల్దిన పోతున్నట్టు
ఆదరాబాదరగా ఉరికే
పొద్దూకెజాముల చూసిన వాగు
ఆప్త మిత్రుని లాగా
రోజు క్రమం తప్పక వచ్చి
ఇంటెనుక తొట్లె నీళ్ళు తాగి పోయే
కడుపుకింద మచ్చలు
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు
తన నెత్తిన తానే నిప్పులు పోసుకున్నట్లు
పాలు తాగుతూ తల్లి గుండెలపై తన్నినట్లు
తినే అన్నంలో మన్ను కలుపుకున్నట్లు
కడుపు నింపే అన్నదాతలపై
లాఠీ దెబ్బలు ఏంటి?
కార్లతో తొక్కించిచంపుడేం
కనులు నింగికి అతుక్కుని
అడుగులు మాత్రం
భూమిలో ఉంటాయి
ఆదర్శం పెదవిపై ఉంటుంది
ఆచరణ మాత్రం శూన్యమై
దర్శనమిస్తుంది
తేనెలో మునకలేస్తూ మాటలు
వెన్నులో దిగుతూ కత్తులు
మాటకూ చేతకూ
ఎక్కడా పొసగదు
చుట్టూ చీకటి కొండలు
పల్లేర్లు పరుచుకున్న దారులు
అడుగు తీసి అడుగు వేస్తే
పాదాలకు చుట్టుకొనే పగల పాములు
దూరమెంతో.. చేరే తీరమెక్కడో
అంతు చిక్కని అనంత పయనం
ఏ గాలికి దీపం ఎప్పుడు ఆరుతుందో
చిల్లుపడి, నావ ఎక్
అప్పుడప్పుడు
నీకు తెలియకుండానే
నీది కాని ఒక ప్రదేశంలో
శిలలా పాతుకు పోవాలనుకుంటావు.
నీ కొమ్మలను నీవే నరుక్కొని,
నీ కలలను తాకట్టు పెట్టుకొని,
నీ గమ్యాన్ని నిర్దాక్షిణ్యంగా ఒంటరి పక్షిని చేసి
ఏదో ఉద్దరిస్తున్న
సూర్యుడు
రోజూ జీవరసాన్ని
అక్కడే జుర్రుకొని
ప్రపంచంలోకి పయనమౌతడు
చంద్రుడు చల్లదనాన్ని
అక్కడినుంచే పొదుగుతడు
ఏళ్ళు సెలయేళ్ళ
జీవనాడి ణఅడవులే ...
సముద్రాల నీటికండలూ
నెత్తుటి ముద్దలన్నీ అడవులే.
అమ్మాయిలు గాలులతో తయారవుతారు
తడబడకుండా వీచడమే గాలుల ఆనందం
తమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు ఒప్పుకోవు
అమ్మాయిలు పూలతో తయారవుతారు
పరిమళాలు వెదజల్లడమే ఆ పూల ఉత్సాహం
తమను నిర్దయగా నలిపిపారేస్తే ఆ పూలు ఒప్పుకోవు
తల్లీతనయుల పేగుబంధం...
తరతరాలుగా ముడివేసిన అనుబంధం...
పెనవేసుకుపోయిన ఋణానుబంధం...
వసుధాసేద్యకుల జీవనబంధం...
తొలకరితో మురిసిపోయే...
నేలతల్లిమనసునుజి
మురిపెముగా దున్నుకొని...
అనురాగ విత్తనాలు తన హదిలో నాటి..
శిఖరమెత్తు తాడిచెట్టు నిన్ను సూడంగనే..
వంగి సలామ్ కొడుతది.
కన్నబిడ్డోలిగె సవురిచ్చి
పాయిరంగ సూసుకున్నందుకు
కన్నతల్లోలిగె సాదుకుంటాంది.
కడుపుల వెట్టుకుని సూసుకుంటాంది.
ఎన్నటి ఋణానుబంధమో...
కంచుట్ల మెతుకు
కనులు నింగికి అతుక్కుని
అడుగులు మాత్రం
భూమిలో ఉంటాయి
ఆదర్శం పెదవిపై ఉంటుంది
ఆచరణ మాత్రం శూన్యమై
దర్శనమిస్తుంది
తేనెలో మునకలేస్తూ మాటలు
వెన్నులో దిగుతూ కత్తులు
మాటకూ చేతకూ
ఎక్కడా పొసగదు
మేకవన్
కట్టె జాగ్రత్త సుమా !!
పయిలం మెల్లగ నడు
పట్టుకున్న కట్టె జాగ్రత్త
పట్టు జాగ్రత్త
ఇపుడు మనిషి కన్నా
కట్టెనే కరెక్టుగా ఉండాలే సుమా
కట్టె విరిగితే మనిషి విరిగినట్లే
లేస్తే కట్టె తోడు
నడిస్తే కట్టె తోడు
వాళ్ళు అంతేలే!
అవకాశం కోసం పొంచి ఉంటారు
అదను చూసుకుని దాడి చేస్తారు
నీ పైనే కులం అనే ముసుగు కప్పేస్తారు
నీకు రక్షణగా మతం అనే గోడలు కట్టేస్తారు.
నిన్ను అటబొమ్మను చేస్తారు
మీడియాలో నిన్ను హీరోని చేస్తారు.
తమ
నేనో నదిని ప్రేమించాను
ఒడ్లు ఒరుసుకుని పారే నదిని -
వేల మైళ్ళదాకా
తన గలగలలు వినిపించే నదిని -
సీతాకోక చిలుకలా
రంగురంగుల రెక్కలున్న నదిని -
గాఢంగా ప్రేమించాను
ఎన్నో విరహపు రాత్రుల తర్వాత
ఉన్నట్టుండి ఓ ర
ఇప్పటికీ కొన్ని వేదికల మీద
ఇంకా ఎవరో గర్వంగా
మాటలమూటల్ని విసురుతూనే ఉన్నారు
నేను అంతరిక్షాన్ని అందుకున్నానని
చందమామను చేరుకున్నానని..
అప్రతిహత శాస్త్ర పురోగతితో
సాంకేతిక ఫలాల్ని అందుకుని
సర్వసుఖాలు అనుభవిస్
అది అందాల పట్నం,
జాతరలో తిరిగే రంగ్గుల రత్నం..!
అక్కడి జీవితాలు గిర్రున తిరిగే బొంగరం,
ఏ మాయలోడికో చిక్కితే బొమ్మలం..!
వలసెల్లే పక్షులకు నీడ నిస్థుంది,
పొట్ట కూటి కోసం ఏదైనా చేయిస్తుంది..!
అందరినీ అక్కున చేర్చుక
మా ఊరిల
కోడికూత
మా నాయిన కత్తినూట
రెండొక్కటే సారి
చీకట్ల బీడి
మిణుకు మిణుకు మంటూ
బుడ్డి దీపంలా వెలుగు
నూరు రాయిమీద
రుయిరుయిమనే
సుమధుర సంగీత ధ్వనులు
నెలవంక రాయిమీద రాగాల చప్పుడు
కత్తి పదు
మనిషికి
వరుస ఉప్పెనలతో ఇప్పుడు
ఊపిరాడడం లేదు
బ్రతుకు తెరువుకు
దారులు అస్సలు కనపడడం లేదు
ఈ మనిషి మనసుకు ఏమైందో
దుఃఖపు గీతాలు ఆలపిస్తూ
కాలం కంటిపై కునుకును మరచింది
ఏ తప్పిదాలు
మనిషి తలకు చుట్టుకొన్న
ఆఫ్ఘనిస్తాన్ ఆమె దేహమైతే
ప్రతి ఇల్లు తాలిబన్ వశమే
స్వేచ్ఛను హరిస్తూ
చదువుకున్నదైతే
కాస్త మాట్లాడనిస్తే
ఏ పదవో ఆమెను వరిస్తే
ఇంకొక మగవ్యక్తితో మచ్చుకు మాటాడితే
ప్రతి ఇంట్లో హింస ఉంటుంది
తాలి
ప్రియా..!
పగలో, రేయో అర్థం కానంతగా
ఆకాశం నిండా మబ్బులు కమ్మేసాయి
అయితే ఏమిటిలే?
నీ కలల దీపాల్ని కళ్ళల్లోకి తీసుకుని,
నీ తలపుల వెలుగుల వెంబడి
నీ పిలుపు వినవస్తున్న వైపుగా ....
గుండె నిండా ధీమాతో అడుగులు వేస్తున్
త్రిలింగ దేశంలో
ప్రభవించిన వెలుగై
అచ్చుల అందాలు
హల్లుల సోయగాలు
అల్పాక్షరాలతో
అనంతార్ధాన్ని అందించే
సాహితీ తరంగిణి
సుమనోహర కవితాగీతిక
మాండలికాల మరుమల్లె
''తెలుగు''భాష
రసరమ్యమై
జిహ్వకు
తెచ్చిపెట్టుకున్న
చుట్టరికం కాదు
అడిగితే వచ్చిన బంధం
అసలే కాదు
ఒకరికి ఒకరుగా
నేను నీకు తోడని
నీవు నాకు నీడని
బాసచేయని భాషగా
పెనవేసిన బంధం
జగతిలో విరబూసిన
అపురూప అనుబంధం
''తోబుట్టువుల'' సంబంధం<
మొలకల వానలో
ముద్ద ముద్దైన బడి పిల్లల్ని చూస్తుంటే
బాధనిపిస్తున్నది
కొంచెం కోపమూ ఉప్పొంగు తున్నది
మొక్కలను పానపానంగా లాలపోసి పెంచిన
లేత మందారాల చిట్టి చేతులు
రంపపు కోతలకు భీతిల్లుతున్నై
తరలి పోతున్న త
వాడెవడో.. ప్రపంచాన్ని జయించీ
కడకు శవపేటికలోంచి ఒట్డి చేతులు చూపిస్తూ వెళ్లిపోయినట్టు
మనమూ ఎలా వచ్చామో ..
అలానే వెళ్లిపోదాం ఒట్టి చేతులతోనే ..
యిక్కడ ప్రతి జ్ఞాపకం బ్రతుకంత బరువు
బతికేపోదాం ఉన్నన్నాళ్లూ యీ అద్దింట్లో
ఒక్కడి బొక్కసం నిండడం,
అనేకుల డొక్కలు ఎండడం..
అభివద్దీ కాదు,
ఆర్ధిక స్వాతంత్య్రమూ కాదు.
ఒక్క రోజు ఓటేసే అధికారం,
తక్కినన్నాళ్ళూ చెల్లని అభిప్రాయం..
ప్రజాస్వామ్యమూ కాదు,
రాజకీయ స్వాతంత్య్రమూ కాదు.
కొన్ని క్రౌంచ్య పక్షులు ఊపిర్లు వదిలి
నింగి అంచుల్లో కలగలసిపోయాయి.
నీటిలో ఊపిరాడని గాలి బుడగలు
నదినిపెనవేసుకున్నాయి.
కంటిపాపలను వదలి
దూరంగా పయనమయ్యాయి.
ఒంటితీగపై నడక సాగి సాగి
నేలకు దిగిన ప్రాణాల
కాస్సేపు చుట్టూ చుట్టూ తిరిగే పిల్లిపిల్లలా
కాళ్ళావేళ్ళా అడ్డం పడుతూ సరదా పడుతూ
మరికాస్సేపు దూరంగా
సుదూరంగా అందినట్టే అంది
వేళ్ళసందుల్లోంచి జారిపోయే నూనె ధారలా
అంతలోనే ఆకాశానికి ఆ చివరన అదశ్యమవుతున్న
కాషాయపు అగర
ప్రవహించడం అంటే
నాలోకి నువ్వు
నీలోకి నేను
మాటల తెప్పపై
మధురానుభూతితో
ప్రయాణించడం
సగం నువ్వు
ఇంకో సగం నేనూ
కొన్ని మార్మికాల్ని మరచి
భుజం భుజం ఆన్చి
ఒక ఒడ్డులా నిలవడం
అపార్థాల అల్లకల
తండాల్... తండాలన్ని...
బోసిబోయిన విధవరాలి మెడలా
మిద్దెలు, మేడలా జాడలేకున్నా
ఉన్న పూరి గుడిసెలన్ని
పురుగుల గుళ్ళవుతుంటే...!
నా లంబాడీ బిడ్డల
''రాం రాం.. భీయా...!'' అనే పలకరింపులు
ఏ పట్నం బాట పట్టాయో..!?
ఇపుడు నేను శిల్పిగా మారి
నన్ను నేను కొత్తగా చెక్కుకుంటున్నాను.
ఓ మనిషీగా మలుచుకుంటున్నాను.
స్వార్ధపు పెచ్చులను ఊడబీకుకుంటూ..
కాస్తంత మానవత్వం ఉన్న మనిషిలా
నన్నునేను మార్చుకుంటున్నాను
ఒక్కో ఉలిదెబ్బ తగులుతుంటే...
వయసు చూస్తేనేమో సగంలో సగం
మనిషి చూస్తే చిర పరిచయ రూపం
బూటింగ్ లో నామ రూపాల మనోఫలకం
పాత జ్ఞాపకాల బ్యాకప్ పొరల నుంచి
ఎంత సెర్చ్ చేసినా కొలిక్కి చిక్కని ఆకారం
నల్లని చలాకీతనం చమత్కారాల సంభాషణ
మూడంకె ముస్తాబు వదిలి
కొత్త రోజును విత్తి చూడు..
పగటిపై పరచిన పరదాలను
ఓ పక్కకు నెట్టి చూడు....
చీకటి కొండెక్కింది, బారెడు పొద్దెక్కింది
కళ్ళు మూసి కలలు కంటే
సత్తుగిన్నెలో సమాధానం ఉడకదు
రెప్పల తలుపులు తెరిస్
ఎత్తు మడమల చెప్పులు
జుత్తు విదల్చని కొప్పులు
కదలాడే కర్ణభూషణాలు
జాలువారే వర్ణవస్త్రధారణలు!
అంగాంగ స్వర్ణాభరణాలు
అపూర్వ నట ధోరణులు
అలంకరణలో అద్వితీయులు
అప్సరసలూ అధములే!
నడకలో కులుకులు
నడతలో ప
తిరిగి తిరిగీ!
నడి ఎడారి
రహదారి ఎండమావిలో
తెగిన చెప్పుతో
బ్రతుకు నావ ప్రయాణం నాదైతే!
నట్ట నడి ఎండలో
ఇరుసిరిగిన బండిపై
మా అయ్య
పడిగాపుల సూర్యుడై
కరిగి కరిగీ! ఒరిగిపోతుండు
మిద్దె మీద అద్దె
పొయి కిందకుంటే
పొయి మీదకు లేని బతుకులే ఇంకా
గాయమైతే
చిటికెడు రాసుకోవటానికే దొరకని పసుపు
నీకు పసుబ్బువ్వెట్ల ఒండిపెట్టాలె?
తలదాచుకునేందుకు
ఇంటి ముందున్న వేప చెట్టునెపుడో
రియల్టరోడు నరికేసిండు
నీకు
నాన్న పుట్టి పెరిగిన గతమంతా
ఆడిపాడే బల్యమంతా
ఎలాగడిచిందో
మనుషుల్ని
పరిస్థితుల్ని
ఎలా చదివాడో
ఎన్ని డక్కీముక్కీలు తిని ఎదిగాడో తెల్వదునాకు
అజానుబాహుడు
ధవళవర్ణ అంగీధోవతిధారుడు
గిరిజాలజుత్తుతో
నొసట
మీ కలం ధ్యాన ముద్రలో
అలా ఎదురుచూస్తూ ఉంటుంది.
అక్షరాలు మీ చుట్టూ అలా ప్రదక్షణం చేస్తూంటాయి
మీ కవితలో వొదిగిపోయిన భావుకతగా
మిగిలిపోవాలని ఆకాంక్ష.
మీ కలం, కవిత్వం తీరని దాహంతో... నిరీక్షిస్తూంది
మీ చేతి స్పర్శ
నన్నా బడికి పంపొద్దు నాన్నా ..
కొన్ని ఇటుకలు సిమెంట్ కలగలిపి కట్టిన
కాంక్రీట్ కారాగారం లాంటి చోటుకు-
పరీక్షలు ర్యాంకులు గ్రేడులే
కొలమానమైన చోటుకు-
నన్ను పంపొద్దు నాన్నా..
అక్కడే రుతువుల్లేవు..
జీవన
సాయంకాలపు హౌరు గాలిలో మేఘాల ఘర్షణ
అతికష్టం మీద ఒడ్డుకు చేరిన పడమటి ఓడలు
పసివాడి నిశ్శబ్దపు కడుపులో ఆకలి గర్జన
కూటి కొరకు ప్రార్థనను అడ్డుకున్న ఎత్తైన మేడలు
తల్లిదండ్రుల అదశ్యం,
మంచి చెడుల వ్యత్యాసం
తెలుసుకో
గుండె గది గోడల మాటున ఎవరివో
గుసగుసలు చిన్నగా వినపడుతున్నాయి
ఎదలోతుల్లో నుండి మరుగున పడ్డ
ప్రతిధ్వనులు సన్నగా వినవస్తున్నాయి
ఎంత వద్దనుకుని వెనక్కు నెట్టి నా
మనసు తెరల మాటున తారట్లాడుతూ
తన మాట వినమంటున్నాడు లోపలి మనిషి
ఎన్ని వేడి దినాల
నింగీ నేలా ఎండ సంభాషణమో
ఎన్ని నెలల
వడగాలుల తండ్లాటనో...
నల్లమబ్బుల ముసుగేసుకొని
చినుకుల చప్పట్లతో సైగ చేస్తూ
నేలను తాకింది మిరుగునాడు ఆకాశ గంగ.
చెయ్యడ్డం బెట్టి
మొగులుకేసి చూసుడ
మానవారాధన ముందు
మళ్ళీ దైవారాధన
వెనక్కి మళ్ళింది
చట్టం న్యాయం ధర్మం
ఇప్పుడున్నీ
తలదించుకున్నాయిగా
అసలు రాజ్యకేతనమే
నేడు సిగ్గుతో నైతిక
అవనతం అయింది
సంకల్పమే కాదు
సుస్థిర క్రియాశీలత
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి
గాలాడ్తలేదు
అంతా చీకటి
నిన్నటిదాకా నా అనుకున్న బంధాలన్నీ
పాతాళంలో దాక్కున్నాయి
ప్రాణానికి యముడికి మధ్య కురుక్షేత్రం
నోట్ల కట్టలకు శ్వాసకు తులాభారం
శ్వాసది పైచూపు
నోట్ల కట్టల
అక్కడ పొగ లేచిందంటే
కొన్ని భవంతుల అస్థికలు
పీలికల్లామారి బయటపడితే
మరికొన్ని దేహాల శకలాలు
రాజ్యాధికార దాహానికి చిచ్చుబుడ్లల్ల
గాల్లో ఎగిసిపడ్తుంటాయి..
పాలస్తీనా పాలబుగ్గల మీద
రక్తపు చారికలు పారుతుంటే
దా
నాగరికత...
నవపుంతలు తొక్కుతున్నా
వివేకం...
దశదిశలా విస్తరించినా
కొందరిని...
వీడని నీడే ఆకలి.
పూటపూటకూ పలకరిస్తూ
పేగుల్నిమెలిపెడుతూ
పేదవారి ముంగిట్లో రంగవల్లై
డొక్కలకు
ఆకలిమంట వర్ణాలద్దుతూ
కళ్లు రెప్పలార్చిన ప్రతిసారి..
వెలుగు చీకట్ల మిలమిలలు
వెక్కిరిస్తున్నాయి..
చేతులు చాచిన ప్రతిసారి..
చేరలేని తీరాన్ని
దూరం వెలివేస్తోంది..
పాదం కదిపిన ప్రతిసారి..
పచ్చిక లతిక స్పర్శ ఆర్తిగా విలపిస్తోంది..
1. గొయ్యితీసి సముద్రాన్ని పాతిపెట్టిన.
ఈడ సముద్రం లేదని శాసనం రాయించిన.
పాశిట్టి దులుపుకుంట మనుషులు
ఉప్పు చారికలై సమాధులపై మొలుత్తాంటె
నాలుగు వానసుక్కల్ని రాల్చమని
మొగులును బతిమాలుకున్న.
బకాయిపడ్డ అప్పు తేరకముందే